https://oktelugu.com/

Unstoppable 4: అన్ స్టాపబుల్ 4′ ఎపిసోడ్ లో నోరు జారేసిన అల్లు అర్జున్..’పుష్ప 2′ విడుదల సమయంలో ఇవేమి మాట మార్చడాలు సామీ!

అల్లు అర్జున్ స్పష్టంగా మన తెలుగు హీరోలకు ఇప్పటి వరకు నేషనల్ అవార్డు రాలేదు అనే విషయం ముందుగానే తెలిసినట్టు చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 08:57 AM IST

    Unstoppable 4(4)

    Follow us on

    Unstoppable 4: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ కి ముఖ్య అతిధిగా హాజరైన ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని నిన్న విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గడిచిన నాలుగు నెలల్లో జరిగిన సంఘటనలపై అల్లు అర్జున్ వివరణ ఇచ్చి వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ వివాదాల ఊసు కూడా ఎత్తకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇదే ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తనకి వచ్చిన నేషనల్ అవార్డు గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఆయనకి తీవ్రమైన నెగటివిటీ ని తెచ్చిపెట్టింది. బాలయ్య అల్లు అర్జున్ తో మాట్లాడుతూ ‘నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉన్నింది’ అని అడగగా దానికి అల్లు అర్జున్ సమాధానం చెప్తూ ‘మన తెలుగు వాళ్లకు నేషనల్ అవార్డు రాలేదని నాకు చాలా బాధగా ఉండేది. దీనిని ఎలా అయినా కొట్టాలని రౌండ్ మార్క్ చేసుకొని కొట్టాను’ అని చెప్పుకొచ్చాడు.

    ఇక్కడ అల్లు అర్జున్ స్పష్టంగా మన తెలుగు హీరోలకు ఇప్పటి వరకు నేషనల్ అవార్డు రాలేదు అనే విషయం ముందుగానే తెలిసినట్టు చెప్పుకొచ్చాడు. కానీ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిన కొత్తలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఉత్తమ నటుడిగా నాకు నేషనల్ అవార్డుని ప్రకటించినప్పుడు నేను ఎంత సంతోషించానో, అంతే షాక్ కి గురి అయ్యాను. ఎందుకంటే నేషనల్ అవార్డు మన తెలుగు హీరోలకు ఇప్పటికే వచ్చిందని అనుకున్నాను, నేను మూడోవాడినో, నాల్గవ వాడినో అని అనుకున్నాను. కానీ టీవీ లో నన్ను ఉత్తమ నటుడి క్యాటగిరీలో నేషనల్ అవార్డుని అందుకున్న తొలి తెలుగు హీరో అని చెప్పడంతో షాక్ కి గురయ్యాను. నేనేదో ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరికంటే గొప్పవాడిని అని చెప్పడం లేదు. ఎంతోమంది అద్భుతమైన నటులు ఉన్నారు, కానీ ఎందుకో దురదృష్టం కొద్దీ వాళ్లకు నేషనల్ అవార్డు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

    కానీ ‘అన్ స్టాపబుల్ 4’ ఎపిసోడ్ లో మాత్రం అల్లు అర్జున్ టార్గెట్ పెట్టుకొని కొట్టినట్టుగా చెప్పుకొచ్చాడు. ఇలా అప్పుడు ఒకమాట, ఇప్పుడు ఒకమాట మాట్లాడడంతో అల్లు అర్జున్ విపరీతమైన ట్రోలింగ్ కి గురి అవుతున్నాడు . వచ్చే నెలలో ‘పుష్ప 2’ విడుదల ఉంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇలా ఫ్లిప్ అయ్యి నెగటివిటీ ని సంపాదించడం ఆయన అభిమానులకు అసలు ఏమాత్రం నచ్చడం లేదు. మరి ఈ నెగటివిటీ ‘పుష్ప 2’ చిత్రం పై ఎంత వరకు ప్రభావితం చూపిస్తుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈనెల 17వ తారీఖున పాట్నా లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని పెట్టి విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.