Homeఎంటర్టైన్మెంట్Pushpa 3: పుష్ప 3 పై అల్లు అర్జున్ కీలక ప్రకటన... మైండ్ బ్లాక్ అయ్యే...

Pushpa 3: పుష్ప 3 పై అల్లు అర్జున్ కీలక ప్రకటన… మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్!

Pushpa 3: అల్లు అర్జున్ ఇమేజ్ ని మొత్తంగా మార్చేసింది పుష్ప. ఏకంగా పాన్ ఇండియా స్టార్ హోదా తెచ్చిపెట్టింది. 2021 డిసెంబర్ లో పుష్ప విడుదల కాగా భారీ విజయం అందుకుంది. నార్త్ లో పుష్ప చిత్రానికి ఊహించని రెస్పాన్స్ దక్కింది. అక్కడ పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు. దాంతో పూర్ ఓపెనింగ్స్ దక్కాయి. అయితే వర్డ్ ఆఫ్ మౌత్ తో మూవీ పుంజుకుంది. పుష్ప హిందీ వెర్షన్ వంద కోట్లకు పైగా రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

కాగా పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుందని మూవీ సెట్స్ పైకి వెళ్ళాక ప్రకటించారు. పుష్ప సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. పుష్ప 2 చిత్రీకరణ దశలో ఉండగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పుష్ప 3 సైతం ఉందని చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు అల్లు అర్జున్.

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అతిథిగా హాజరైన అల్లు అర్జున్… అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పుష్ప 3 కూడా ఉంటుందని అన్నారు. పుష్ప ను ఒక ఫ్రాంచైజీగా చేయనున్నాము. ఈ సిరీస్లో చిత్రాలు వస్తాయి. పుష్ప 3 ఉంటుంది. దాని కోసం ఒక అద్భుతమైన ఐడియా సిద్ధం చేశాము. ఇక పుష్ప చిత్రానికి మించి పుష్ప 2 ఉంటుంది. పుష్ప లో చూసిన పుష్ప రాజ్ కి పుష్ప 2 లో పుష్ప రాజ్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ మెస్మరైజ్ చేస్తుందని… అన్నారు.

కాబట్టి పుష్ప సిరీస్ కొనసాగుతుందని ఒక క్లారిటీ వచ్చేసింది. పుష్ప 3 కూడా చేస్తానని అల్లు అర్జున్ చెప్పిన నేపథ్యంలో.. మరి ఈ సిరీస్లో ఎన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. పుష్ప 2లో ప్రధాన విలన్ రోల్ ఫహాద్ ఫాజిల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular