Allu Arjun Remuneration: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తనదైన చిత్రాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకు ప్రత్యేకతలు జోడిస్తూ అభిమానులను రంజింపచేస్తున్నాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప ఎన్నో రికార్డులు సృష్టించింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బన్నీ స్థాయిని మరింత పెంచింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సృష్టించిన కలెక్షన్ల సునామీ తెలిసిందే. అందులో నటించిన నటీనటులకు కూడా అంతే పేరు రావడం గమనార్హం. ఇక పుష్ప2 కోసం కూడా కసరత్తు జరుగుతోంది. కథాచర్చలు పూర్తయ్యాయి. ఇక సినిమా సెట్ మీదకు వెళ్లాల్సిందే. ఇందులో కూడా ఎన్నో వైవిధ్యభరితమైన ట్విస్ట్ లు ఉంటాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

బన్ని పుష్ప సినిమాకు రూ.45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రూ. 18 కోట్లు తీసుకున్నాడని సమాచారం. పుష్ప2 కోసం బన్ని ఏకంగా రూ. వంద కోట్ల మైలు రాయిని దాటాడని చెబుతున్నారు. వంద కోట్లు అంతకుమించి అంటున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 1.25 కోట్లు తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. సుకుమార్ సైతం రూ.75 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప2 బడ్జెట్ దాదాపు రూ.350 కోట్ల పైమాటే అన్నట్లు చెబుతున్నారు. ఇంత భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడం నిజంగా రిస్కే. సినిమా బోల్తా కొడితే నిర్మాత పరిస్థితి ఏంటి? అనే సందేహాలు వస్తున్నా పరిశ్రమలో ఇవన్నీ మామూలే అనే వాదనలు కూడా వస్తున్నాయి.
Also Read: Telugu Film Producers Stop Shoots: గిల్ట్ నిర్మాతలూ.. అత్త మీద కోపం దుత్త మీద చూపితే ఎలా ?
అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ కావడంతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. వంద కోట్లు దాటడం అంటే మామూలు విషయం కాదు. తన సత్తాతో సినిమా రేంజ్ ను కూడా పెంచగల ప్రతిభావంతుడు బన్ని. అందుకే అంతటి పారితోషికం తీసుకుంటున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈనేపథ్యంలో బన్ని భవిష్యత్ లో మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి రెమ్యునరేషన్ ను అందుకునే దిశగానే చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బన్ని ఇంతటి పారితోషికం తీసుకుంటాడని ఎవరు కూడా అనుకోలేదు.

ఇక పుష్ప2 సినిమా విషయంలో ఇప్పటికే కథాచర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే వర్క్ పూర్తి చేసుకుని త్వరలో సినిమా పట్టాలెక్కనుంది. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై కూడా రకరకాల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. శ్రీవల్లి పాత్రను చంపేస్తారని ఓ వార్త గతంలోనే వచ్చింది. దీంతో పుష్ప2 మీద అభిమానుల అంచనాలు వమ్ము చేయకుండా తనదైన శైలిలో నిర్మించేందుకు సుకుమార్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
[…] Also Read: Allu Arjun Remuneration: రెమ్యూనరేషన్ లో అల్లు అర్జు… […]