Allu Arjun Movies : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేవలం పుష్ప సిరీస్ చేయడం వల్ల పాన్ ఇండియన్ క్రేజ్ రాలేదు అనే విషయాన్ని గమనించాలంటూ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ లో ఉన్న అద్భుతమైన టాలెంట్ డ్యాన్స్. డ్యాన్స్ చూసే ఆడియన్స్ కి భాషతో, ప్రాంతంతో సంబంధం లేదు. అలా అల్లు అర్జున్ తన డ్యాన్స్ ద్వారానే ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళాడు. ముందుగా ఆయనకీ కేరళలో మార్కెట్ ఏర్పడింది. అక్కడి యూత్ ఆడియన్స్ అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోతారు. అక్కడి హీరోల కంటే ఎక్కువగా అల్లు అర్జున్ కి క్రేజ్ ఉంది. ఇది అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అల్లు అర్జున్ నటించిన ‘హ్యాపీ’ చిత్రం మలయాళం లో డబ్ అయ్యి గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది.
తెలుగు లో ఫ్లాప్ అయిన ఈ చిత్రం కేరళలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అక్కడి థియేటర్స్ లో వంద రోజులకు పైగా ఆడింది. ఈ చిత్రం నుండే అల్లు అర్జున్ క్రేజ్ కేరళ లో వ్యాప్తి చెందింది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటించే ప్రతీ సినిమా కేరళలో విడుదలయ్యేది. అలా అప్పటి నుండి అల్లు అర్జున్ కేరళ కింగ్ గా మారిపోయాడు. తనని ఇతర రాష్ట్రాల ఆడియన్స్ అమితంగా ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని గమనించిన అల్లు అర్జున్, 2011 వ సంవత్సరం నుండి తన ప్రతీ సినిమాని హిందీ లో డబ్ చేసి విడుదల చేయించేవాడట, అప్పట్లో మన తెలుగు హీరోల సినిమాలను డబ్ చేసి , డిస్ట్రిబ్యూట్ చేసేంత సీన్ ఇచ్చేవారు కాదు బాలీవుడ్ ట్రేడ్. అందుకే అల్లు అర్జున్ స్వయంగా తన సొంత ఖర్చులతో తన సినిమాలను హిందీ లో విడుదల చేసేవాడట.
అలా చిన్నగా అల్లు అర్జున్ సినిమాలను హిందీ ఆడియన్స్ చూడడం మొదలు పెట్టారు. ముందుగా ఆయన డ్యాన్స్ ని అక్కడి ఆడియన్స్ తెగ ఇష్టపడ్డారు. నార్త్ ఇండియా మొత్తం అలా అల్లు అర్జున్ పాపులారిటీ నెమ్మదిగా పాకింది. గురి చూసి పుష్ప సినిమా తో వచ్చాడు, కుంభస్థలం బద్దలైంది అంటూ బన్నీ వాసు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ కి పైకి ఎదగాలి అనే కసే ఈరోజు ఆయన్ని ఈ స్థానం లో నిలబెట్టింది. ఆయనకీ ఉన్నంత కసి టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ బాలీవుడ్ లో ఎలా ఉందంటే, ఖాన్స్ ని సైతం అక్కడి ఆడియన్స్ మర్చిపోయే రేంజ్ లో ఉంది. మన తెలుగు హీరో ఈ స్థాయిలో అక్కడికి వెళ్లి టాప్ చైర్ లో కూర్చోవడం అల్లు అర్జున్ అభిమానులకు మాత్రమే కాదు, ప్రతీ తెలుగోడి గర్వంగా ఉంది.