Adipurush- Rajamouli: టాలీవుడ్ నుండి మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఆయనతో సినిమా అంటే వందల కోట్ల రూపాయిల పెట్టుబడులతో కూడుకున్న వ్యవహారం..ప్రస్తుతం ఆయన వరుసగా చేస్తున్న సినిమాల బుడ్జెట్స్ అన్ని కలిపితే 1500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది..వాటిల్లో కేవలం ఆదిపురుష్ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలట..చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలనుకున్నారు.

దానికి తగ్గట్టుగానే ప్లానింగ్స్ చేసుకున్నారు..కానీ ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి ఎలాంటి నెగటివ్ రివ్యూస్ వచ్చాయో మన అందరికి తెలిసిందే..ప్రభాస్ ఫాన్స్ సైతం ఈ కార్టూన్ బొమ్మల సినిమా కోసం మా హీరో సమయం వృధా చేస్తారా అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో బాగా తిట్టడం ప్రారంభించారు..ఈ నెగటివ్ కామెంట్స్ ని ప్రభాస్ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం.
సినిమాని వాయిదా వేసి గ్రాఫిక్స్ పై మరింత శ్రద్ద పెట్టండి..బెస్ట్ ఔట్పుట్ వచ్చినప్పుడే మనం ఈ చిత్రాన్ని విడుదల చేద్దాం అని డైరెక్టర్ కి చెప్పాడట..దీనితో డైరెక్టర్ ఓం రాత్ ఈ చిత్రాన్ని జులై 16 వ తేదీన విడుదల చేస్తునట్టు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసాడు..అయితే ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ ని మెరుగుపర్చడానికి అదనంగా మరో 150 కోట్ల రూపాయిలు ఖర్చు కానుంది అట..మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న సినిమా కావడం వల్లే గ్రాఫిక్స్ అభిమానులకు నచ్చలేదని..థియేటర్స్ లో చూస్తే మీకు కలిగే అనుభూతి వేరని డైరెక్టర్ కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా ప్రభాస్ ఒప్పుకోలేదట..ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ వర్క్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళి పర్యవేక్షణ లో జరగబోతున్నట్టు తెలుస్తుంది.

రాజమౌళికి ఎన్నో హాలీవుడ్ VFX డిజైన్ చేసే కంపెనీలతో అనుబంధం ఉంది..ఆయన విజన్ లో ఉండే గ్రాఫిక్స్ సహజనికి చాలా దగ్గరగా ఉంటుంది..తనకి కావాల్సిన విధంగా ఔట్పుట్ వచ్చేంత వరుకు వదలదు..అందుకే ప్రభాస్ రిక్వెస్ట్ చెయ్యడం తో గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పర్యవేక్షించడానికి రాజమౌళి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది..ప్రభాస్ ఫాన్స్ కి ఒక విధంగా ఇది పండగ లాంటి వార్తే అని చెప్పొచ్చు.