Homeఎంటర్టైన్మెంట్Sneha Reddy Visits Sritej House: శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి స్నేహా...

Sneha Reddy Visits Sritej House: శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి.. వీడియో వైరల్..

Sneha Reddy Visits Sritej House: 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోస్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రమైన గాయాల పాలై స్పృహ కోల్పోవడం, అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడని ఆయనపై కేసులు వేసి అరెస్ట్ చేయడం వంటివి నేషనల్ లెవెల్ లో ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూశాము. దురదృష్టం కొద్దీ జరిగిన ఈ సంఘటనలను తల్చుకుంటే అల్లు అర్జున్ అభిమానులు ఇప్పటికీ బాగా ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ సంఘటన వాళ్లకు ఒక పీడకల లాంటిది. అయితే అల్లు అర్జున్ ఆ కుర్రాడి కుటుంబానికి ఆర్థికసాయం చేయడమే కాకుండా, ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరించాడు. తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయం అందించింది. అయితే శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు అనే సంగతి తెలిసిందే.

మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడు , ఆహరం కూడా తీసుకోవడం అతనికి కష్టం గా ఉంది. అయితే అల్లు అర్జున్ కుటుంబం ఇప్పటికీ శ్రీతేజ్ ని , అతని కుటుంబాన్ని మర్చిపోలేదు. నేడు అల్లు స్నేహా రెడ్డి , అల్లు అరవింద్ శ్రీతేజ్ ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబం తో కాసేపు గడిపి వచ్చారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాలు తీసి , ఆర్థికసాయం అందించి, ఎలాంటి సమస్య వచ్చినా మీకు మేము అండగా ఉన్నాము అంటూ భరోసా అందించారు. అదే విధంగా శ్రీతేజ్ సోదరిని కూడా అల్లు అరవింద్ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. బాగా చదువుకోవాలని, మీ బిడ్డ చదువుకి అవసరమయ్యే డబ్బులు మొత్తం నేనే పెట్టుకుంటానని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అల్లు అరవింద్, అల్లు స్నేహా రెడ్డి ఇప్పటికీ ఆ బిడ్డని ఇంత గుర్తుపెట్టుకొని సహాయ సహకారాలు అందించడం నిజంగా గొప్ప విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్ శ్రీతేజ్ ని పట్టించుకోలేదని దురాభిమానుల వేరే లెవెల్ దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం నుండి అల్లు కుటుంబం ఎలాంటి ఒత్తిడి లేదు శ్రీతేజ్ ని కలవమని, అయినప్పటికీ కూడా శ్రీతేజ్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఎంత మంచి మనసు ఉంటే ఇలా చేస్తారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ని అప్పుడు చాలా మంది అపార్థం చేసుకున్నారని, ఆయన మనసు ఇంత గొప్పదని అంటున్నారు. రాబోయే రోజుల్లో శ్రీతేజ్ విషయంలో అల్లు అర్జున్ కుటుంబం అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version