https://oktelugu.com/

బాలీవుడ్ హీరోయిన్ కావాలంటే ‘రష్మికా’ని తీసేయ్

సౌత్ హీరోలందరికి ఇప్పుడు ఉన్న ఏకైక గోల్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడమే. అందుకే మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, తమ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వాలంటే కచ్చితంగా బాలీవుడ్ స్టార్స్.. తమ సినిమాలో ఉండాలి. వాళ్ళు ఉంటేనే సినిమాకి పాన్ ఇండియా ముద్ర వస్తోంది. కేజిఎఫ్ కోసం ‘సంజయ్ దత్’కి భారీ మొత్తం ఇచ్చి తీసుకుంది. అందుకోసమే […]

Written By:
  • admin
  • , Updated On : July 30, 2020 / 06:49 PM IST
    Follow us on


    సౌత్ హీరోలందరికి ఇప్పుడు ఉన్న ఏకైక గోల్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడమే. అందుకే మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, తమ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వాలంటే కచ్చితంగా బాలీవుడ్ స్టార్స్.. తమ సినిమాలో ఉండాలి. వాళ్ళు ఉంటేనే సినిమాకి పాన్ ఇండియా ముద్ర వస్తోంది. కేజిఎఫ్ కోసం ‘సంజయ్ దత్’కి భారీ మొత్తం ఇచ్చి తీసుకుంది. అందుకోసమే ఆర్ఆర్ఆర్ లో ఆలియాకి కూడా భారీ మొత్తాన్ని ముట్టజెప్పారు. కానీ మిగతా హీరోల సినిమాల్లో కూడా బాలీవుడ్ స్టార్స్ నటించాలి.. ఇక్కడే వచ్చింది సమస్య.

    Also Read: ‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !

    అల్లు అర్జున్ లాంటి హీరోకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దొరకడం లేదు. బన్నీ – సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప‘ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది, అంటే ఐటమ్ సాంగ్ అన్నమాట. ఎలాగైనా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఆ ఐటమ్ సాంగ్ కోసం ఒప్పించాలని మేకర్స్ ఎప్పటి నుండో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఏ స్టార్ హీరోయిన్ బన్నీతో ఐటమ్ చేయడానికి ఒప్పుకోవట్లేదట. ఇలా అయితే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలనే కోరిక తీరదు. అందుకే ఐటమ్ సాంగ్ కోసం తనతో స్టెప్స్ వేయడానికి బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఒప్పుకునేలా చూడాలని.. బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ నిర్మాతను అప్రోచ్ అయ్యారట బన్నీ టీం.

    Also Read: మెగాస్టార్ ను చూసి బాలయ్య ఇలా చేయడం విశేషమే !

    మరి బన్నీ కోసం ఏ స్టార్ హీరోయిన్ ఒపుకుంటుందో.. ఒకవేళ ఎవ్వరు ఒప్పుకోకపోతే బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఇషా గుప్తాను తీసుకోవాలనుకుంటున్నా.. నిజానికి ఇషాకి బాలీవుడ్ స్టార్ అనే స్టేటస్ లేదు. అప్పుడు ఇషాని తీసుకున్నా ఉపయోగం ఏముంది ? మరి బన్నీకి స్టార్ హీరోయిన్ దొరుకుతుందో లేక ఇషాతోనే ఎడ్జెస్ట్ అవ్వాలో చూడాలి. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అసలు రష్మికను తీసేసి.. మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోవచ్చు, అంతేగాని ఐటమ్ సాంగ్ కి అంటే ఎవ్వరు మాత్రం ఒప్పుకుంటారు.