Most Eligible Bachelor success meet: ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో, పైగా యూత్ లో క్రేజ్ ఉన్న ఒక హీరో బాక్సాఫీస్ వద్ద విజయవంతం అవ్వడానికి ఇంతగా కష్టపడాలా ? అసలు ఆ హీరో సినిమాకి ఎందుకు కలెక్షన్స్ రావడం లేదు ? థియేటర్స్ దగ్గర ఆ హడావిడి ఎందుకు ఉండటం లేదు ? స్టార్ డమ్ ఉంది కదా.. ఎందుకు ఇంకా ఏవరేజ్ హీరో కలెక్షన్స్ కూడా రావడం లేదు ? అంటూ అక్కినేని అభిమానులు కలత చెందుతున్నారు. అవును, అఖిల్ గురించే ఈ తంతంగం అంతా.

నిజానికి అఖిల్ అక్కినేనికి మంచి ఫాలోయింగ్ ఉంది. నేటి జనరేషన్ అమ్మాయిల్లో అఖిల్ కి ఫుల్ క్రేజ్ ఉంది. అయినా అఖిల్ మాత్రం సాలిడ్ హిట్ కొట్టడానికి కిందామీదా పడుతున్నాడు. ఎప్పటినుండో ఓ భారీ హాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో తొలి విజయం మొత్తానికి వచ్చేసింది అంటూ డప్పు కొట్టుకోవడమే తప్ప నిజమైన విజయం మాత్రం అఖిల్ కి ఇప్పటికీ రాలేదు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే.. అఖిల్ మొదటి మూడు సినిమాలు కమర్షియల్ గా పెద్ద ప్లాప్స్. అందుకే, ఎట్టి పరిస్థితుల్లో తన నాలుగో సినిమా విజయం సాధించాలని ఎన్నో రకాలుగా కసరత్తులు చేశాడు. ఎన్ని కసరత్తులు చేసినా అఖిల్ కి మాత్రం హిట్ రాలేదు. అఖిల్ నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ఈ దసరా సందర్భంగా 15వ తారీఖున భారీ స్థాయిలో రిలీజ్ అయింది.
మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ చూస్తే బాధ కలిగింది. అలా వచ్చాయి ఈ సినిమాకి కలెక్షన్స్. సరే.. మొదట రోజు టాక్ కొంచెం మిక్స్డ్ గా వచ్చినా.. ఎలాగూ దసరా సెలవులు కాబట్టి.. ఈ సినిమాకి రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతాయని భావించారు. కానీ కట్ చేస్తే.. రోజులు గడుస్తున్నాయి గాని, కలెక్షన్స్ మాత్రం పెరగడం లేదు. పైగా తగ్గుతూ వస్తున్నాయి.
Also Read: King Nagarjuna: మెగాస్టార్ ను ఫాలో అవుతున్న కింగ్ నాగార్జున …
ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది. అసలు సక్సెస్ ఎక్కడ వచ్చింది ? వేడుక చేసుకోవడానికి అని సగటు ప్రేక్షకుడు అడగడు కాబట్టి.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ సక్సెస్ మీట్ అంటూ దైర్యంగా మేకర్స్ ఒక చిన్నపాటి వేడుక జరుపుకున్నారు. అన్నిటికీ మించి ఈ వేడుకకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అసలు సక్సెస్ కానప్పుడు సక్సెస్ మీట్ ఎందుకో ?
Also Read: ఆ నిర్మాత చావుకి కారణం 70 కోట్ల అప్పు లేనా ?