Allu Arjun , Trivikram
Allu Arjun and Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ఇక ఇప్పటికే కొంతమంది నటులు తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరి కొంతమంది మాత్రం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు… ఇక పుష్ప 2 సినిమాతో భారీ రేంజ్ లో ఎలివేట్ అయిన అల్లు అర్జున్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ చాలామంది చాలా రకాల అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతకుముందే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి కమిట్ అయ్యాడు. మరి ఆయనతో సినిమా చేయాల్సింది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా ఎప్పుడు చేస్తాడు వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక భారీ పౌరాణికానికి సంభందించిన సినిమా రాబోతున్నట్టుగా తెలూస్తోంది. మహాభారతంలో ఉన్న ఒక వ్యక్తి గురించి డీప్ గా ఎవరికి తెలియదు.
Also Read : అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ టీజర్ విడుదల ఖరారు..ఈ గ్యాప్ లో ఇంత షూటింగ్ జరిగిపోయిందా!
కాబట్టి ఆయన గురించి ఈ సినిమాలో తెలియజేస్తారట. మరి ఆయన ఎవరు అనేది కూడా సినిమా యూనిట్ ఇప్పటి వరకైతే ఎక్కడ చెప్పడం లేదు. కానీ అతనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తో ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కొంతవరకు ఫిక్షన్ ను కూడా జోడిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అత్యధిక బడ్జెట్ తో పౌరాణికానికి సంభందించిన సినిమా వస్తుంది అంటే అది ఏ రేంజ్ లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అల్లు అర్జున్ సైతం అలాంటి సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. కాబట్టి అట్లీ సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇప్పుడు వస్తున్న ఈ నాలుగో సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అంటూ అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు త్రివిక్రమ్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు…
Also Read : త్రివిక్రమ్ కి ఒక కండిషన్ పెట్టిన అల్లు అర్జున్…అదేంటంటే..?