Allu Arjun Akshay Kumar And Mahesh Babu: హీరోలు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ఎన్నో దశాబ్దాల నుండి ఆనవాయితిగా వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క క్రేజ్ ఉన్న హీరో ని తమ ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తే వారి ప్రోడక్ట్ సేల్స్ అమాంతం గా పెరిగిపోతాయి అని వారి అంచనా..మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మొట్టమొదటగా ఒక్క ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..అప్పట్లో ఆయన పెప్సీ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసాడు..ఆయన తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసాడు..కానీ అప్పట్లో కూల్ డ్రింక్స్ లో విష పదార్దాలు వచ్చి చేరుతున్నాయి అని ప్రచారం రావడం తో పవన్ కళ్యాణ్ అప్పటి నుండి యాడ్స్ చెయ్యడం మానేశారు..డబ్బుకంటే జనాల ప్రాణాలు ముఖ్యం అని..తనని నమ్మి లక్షలాది మంది ఒక్క ప్రోడక్ట్ ని కొంటారు అని..కానీ వాటిని వాడడం వల్ల ఎవరి ప్రాణాలకు హాని జరిగినా నేనే బాద్యుడిని అని పవన్ కళ్యాణ్ అప్పటి నుండి యాడ్స్ ఇవ్వడం మానేసాడు.

కానీ కొంతమంది హీరోలు భారీ మొత్తం లో డబ్బులు ఇస్తే సిగరెట్ , మందు మరియు పాన్ వంటి వాటికి కూడా యాడ్స్ ఇచ్చేస్తున్నారు..కానీ ఇటీవల అల్లు అర్జున్ కి ఒక్క ప్రముఖ టొబాకో కంపెనీ భారీ మొత్తం లో డబ్బులు ఆఫర్ చేసి తమ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి అని కోరగా..అల్లు అర్జున్ వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు..అల్లు అర్జున్ చేసిన ఈ పనికి ఆయన అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు..ఇటీవలే అక్షయ్ కుమార్ కూడా ఒక్క ప్రముఖ టొబాకో కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు..దీనితో ఆయన అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడం తో ..ఇక నుండి ఇలాంటి బ్రాండ్స్ కి దూరం గా ఉంటాను,నన్ను అభిమానించే అభిమానులు హర్ట్ అయ్యి ఉంటె దయచేసి నన్ను క్షమించండి అంటూ ఒక్క ప్రెస్ నోట్ ని విడుదల చేసాడు అక్షయ్ కుమార్.
Also Read: Komaram Bheem Song: ‘కొమురం భీముడో ‘ వీడియో సాంగ్ ని అందుకే విడుదల చెయ్యలేదా??
ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ బాహర్ అనే టొబాకో కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అభిమానుల నుండి దీని వల్ల మహేష్ బాబు కి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతున్నా కూడా ఆయన ఆ యాడ్ చెయ్యడం మానడం లేదు..తన యాడ్స్ నుండి వచ్చే డబ్బులతో 30 శాతం పిల్లల గుండె ఆపరేషన్స్ కోసం ఉపయోగించే గొప్ప మనస్సు ఉన్న మహేష్ బాబు ఇలాంటి యాడ్స్ కి దూరంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు..ఈ విషయం ఆయన వరుకు చేరిందో లేదో తెలియదు కానీ..ఒక్క పాపులర్ ఇమేజి ఉన్న స్టార్ ఇలాంటి ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పని చెయ్యడం వల్ల కొన్ని లక్షల మంది ప్రభావితం అవుతారు..పొగ త్రాగుట ఆరోగ్యానికి హాని కరం అని సినిమా ప్రారంభం లో యాడ్స్ ఇచ్చే మనం..మళ్ళీ పొగ తాగండి అంటూ యాడ్స్ ఇవ్వడం ఎంత వరుకు సమంజసం అనేది కొంతమంది వాదన..ఈ టొబాకో యాడ్ వల్ల మహేష్ కి ఏర్పడిన నెగటివిటీ ని గుర్తించి ఆ యాడ్ ని చెయ్యడం విరమించుకుంటాడో లేదో చూడాలి.
Also Read: KCR vs Governor: కేసీఆర్ వర్సెస్ గవర్నర్: అగ్నికి ఆజ్యం పోస్తున్న అసదుద్దీన్?
[…] Malaika Arora: కొందరి హీరోయిన్ల ప్రేమ బంధాలు మరీ విచిత్రంగా ఉంటాయి. పైగా పెళ్లి అయిపోయి, ఎదిగిన పిల్లలు ఉన్న ఓ ఇల్లాలు.. ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడటం, అతని కోసం కుటుంబాన్నే వదిలిపెట్టడం వంటి వార్తలు వింటుంటే.. చలంగారి ‘మైదానం’ నవల గుర్తుకు వస్తుంది. సింహాసనం మీద కూర్చోబెడితే, గుమ్మం దగ్గర చెప్పుల రుచి మరిగితే.. ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ఇంతకీ ఆ ఇల్లాలు ఎవరు అంటే.. బాలీవుడ్ ఐటమ్ హీరోయిన్ ‘మలైకా అరోరా’. […]
[…] Viral News: ఆన్ లైన్ మోసాలకు అంతేలేదు. రోజుకో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నా అప్రమత్తం కావడం లేదు. ఫలితంగా రూ. లక్షలు స్వాహా అవుతున్నాయి. ఉత్తపుణ్యానికి ఉన్నదంతా ఊడ్చిపెడుతూ ఘరానా మోసాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికే పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా వినడం లేదు. అపరిచితులను నమ్మి లక్షలు దోచిపెడుతున్నారు. తాజాగా వినూత్న రీతిలో వృద్ధుడు మోసపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. […]