అడవిలో చిరుత‌లా పుష్పరాజ్.. గ్లింప్స్ వీడియో కేక!

స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మూవీ పుష్ప‌. బ‌న్నీ కెరీర్లోనే భారీ బ‌డ్జెట్ తో తొలి పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌తోందీ చిత్రం. ఈ మూవీలో లారీ క్లీన‌ర్ గా న‌టిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే.. బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంట‌ల‌కు టీజర్ రిలీజ్ చేయ‌బోతోంది యూనిట్‌. అయితే.. ఈ వారం గ్యాప్ […]

Written By: Bhaskar, Updated On : April 3, 2021 12:32 pm
Follow us on


స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మూవీ పుష్ప‌. బ‌న్నీ కెరీర్లోనే భారీ బ‌డ్జెట్ తో తొలి పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌తోందీ చిత్రం. ఈ మూవీలో లారీ క్లీన‌ర్ గా న‌టిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే.. బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంట‌ల‌కు టీజర్ రిలీజ్ చేయ‌బోతోంది యూనిట్‌.

అయితే.. ఈ వారం గ్యాప్ లో రోజుకో స‌ర్ ప్రైజింగ్ న్యూస్ రివీల్ చేస్తామ‌ని ప్ర‌కటించారు మేక‌ర్స్‌. ఇందులో భాగంగా మొద‌టి గ్లింప్ ను ఇవాళ వ‌దిలారు. ముఖానికి ముసుగేసి, తాళ్ల‌తో చేతులు వెన‌క్కి క‌ట్టిన బ‌న్నీ.. అడ‌విలో దుమ్ములేపుతూ చిరుత‌లా ప‌రిగెడుతున్నాడు. ఇది చూస్తుంటే.. పోలీసుల నుంచి త‌ప్పించుకుని ప‌రిగెడుతున్న‌ట్టుగా ఉంది.

ఈ సంద‌ర్భంగా డీఎస్పీ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంస్ అనేట్టుగా ఉంది. ఈ గ్లింప్ వీడియోతో అభిమానుల్లో ఉత్కంఠ మ‌రింత పెరిగింది. దీంతో.. టీజ‌ర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాట‌ప‌డుతున్నారు.

ఇదిలాఉంటే.. బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రిలీజ్ చేయ‌బోయే టీజ‌ర్‌ కేజీఎఫ్-2 టీజ‌ర్ త‌ర‌హాలో ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఇందులో డైలాగులు ఏవీ ఉండ‌వ‌ని తెలుస్తోంది. కేవ‌లం హీరో ఎలివేష‌న్ హైలెట్ గా ఉండేలా చూస్తున్నాడ‌ట సుకుమార్‌. ఇక‌, ఈ వీడియోకు డీఎస్పీ ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోతుంద‌ని అంటున్నారు. మ‌రి, దాని రేంజ్ ఏంట‌న్న‌ది చూడాలంటే.. ఏప్రిల్ 7 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.