https://oktelugu.com/

అల్లు అర్జున్ డబుల్ ధమకా

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ఈ మూవీ నాన్ బహులి రికార్డును సొంతం చేసుకుందని సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే ‘అలవైకుంఠపురములో’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి మూవీని పట్టాలెక్కిందుకు సిద్ధమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ తొలిసారి డ్యూయల్ రోల్స్ చేస్తుండటం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 25, 2020 / 07:07 PM IST
    Follow us on

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ఈ మూవీ నాన్ బహులి రికార్డును సొంతం చేసుకుందని సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే ‘అలవైకుంఠపురములో’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి మూవీని పట్టాలెక్కిందుకు సిద్ధమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ తొలిసారి డ్యూయల్ రోల్స్ చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

    చిరు-152లో మెగాస్టార్ డ్యూయల్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు డబుల్ ధమకా సిద్ధం చేశాడు. ఈ మూవీలో ఆగస్టులోనే విడుదలకు సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారి డ్యూయల్ చేస్తుండటంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ మూవీ కూడా ఇదే ఏడాది ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఒకే ఏడాది మామ-అల్లుడు డ్యూయల్ రోల్స్ చేస్తుండంతో ఈ మూవీలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పాత్రలో అల్లు అర్జున్ గుబురు గడ్డం, ఉంగాల జుట్టుతో మాస్ అప్పీయరెన్స్ లో కనిపించనున్నాడు. మరో పాత్రలో క్లాస్ లుక్కులో కనిపించనున్నాడు.

    సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య-2’ మంచి విజయం సాధించాయి. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న ఖరారైంది. ‘సరిలేరునికెవ్వరు’, ‘భీష్మ’ వంటి భారీ హిట్లతో రష్మిక మంచి ఉత్సాహంతో ఉంది. ఈ మూవీని డీఎస్పీ సంగీతాన్ని బాణీలను అందిస్తున్నాడు. రంగస్థలంతో దర్శకుడు సుకుమార్, ‘అల..వైకుంఠపురములో’ మూవీతో అల్లు అర్జున్, ‘సరిలేరునికెవ్వరు’ మూవీతో రష్మిక, దేవీశ్రీ ప్రసాద్ ఈ ఏడాది భారీ సక్సస్ అందుకున్నారు. వీరిందరికీ కాంబినేషన్లో మూవీ సెట్ కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.