స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మూవీ పుష్ప. బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతోందీ చిత్రం. అనౌన్స్ నుంచీ హై బజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం టీజర్ తాజాగా బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ టీజర్ బన్నీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ఉంది.
ఈలలతో గోలపెట్టి.. గొర్రెలను అడ్డుపెట్టి ఎర్ర చందనం దొంగలు ఎలా దుంగలను దోపిడీ చేస్తారన్నది మూవీ టీజర్ లో ముందుగా చూపించారు. బన్నీ ఎలా పోలీసుల నుంచి పారిపోయాడు. పోలీసులను ఎలా కొట్టాడన్నది ఎమోషనల్ గా చూపించారు.
బన్నీ ఈ టీజర్ లో పేల్చిన ఒకే ఒక డైలాగ్ ‘తగ్గేదే లేదు’. ముఖానికి ముసుగుతో బన్నీ చేసిన ఫైట్స్ గూస్ బాంబ్స్ తెప్పిస్తున్నాయి. మొత్తంగా స్టైలిష్ స్టార్ అన్న పదానికి నిజమైన నిర్వచనంలా ఈ టీజర్ ఉంది.
సుకుమార్ – బన్నీ కాంబోలో రాబోతున్న మూడో చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సెట్‌చేసింది.
ఇప్పటికే వదిలిన ఫస్ట్ లుక్, చిత్రాల్లో బన్నీ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ లో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ భీకరంగా కనిపిస్తున్నాడు. అందరి అంచనాలు పెంచేలా టీజర్ ను సుకుమార్ తీర్చిదిద్దాడు. బర్త్ డే సందర్భంగా ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు.
ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఈ టీజర్ ను కేజీఎఫ్-2 టీజర్ తరహాలో కట్ చేశారు. హీరో ఎలివేషన్ హైలెట్ గా ఉంది. గంధపు చెక్కల స్మగ్లర్ గా గూస్ బాంబ్స్ తెప్పించేలా బన్నీ నటన ఉంది. ఇక, ఈ టీజర్ కు డీఎస్పీ ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది.