NATS 2025 Allu Arjun: నార్త్ అమెరికా లో TANA ఫౌండేషన్ గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఇది తెలుగు వాళ్లకు సంబంధించిన ఫౌండేషన్ అని అందరూ అంటుంటారు కానీ, కొంతమంది మాత్రం కేవలం ఒక వర్గానికి చెందిన ఫౌండేషన్ మాత్రమే అని అంటుంటారు. ఈ ఫౌండేషన్ పై ఇప్పటి వరకు ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ప్రతీ ఏడాది TANA ఫౌండేషన్ నిర్వహించే ఉత్సవాలు ఎంతో ఘనంగా ఉంటాయి. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా మొదలు పెట్టారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), సుకుమార్(Sukumar), శ్రీలీల(Sreeleela) ,సమంత(Samantha Ruth Prabhu) ఇలా ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్న ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!
ముఖ్యంగా ఆయన ఇండియన్స్ గురించి, తెలుగు వాళ్ళ గురించి అక్కడ మాట్లాడిన మాటలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ఆయన మాట్లాడుతూ ‘ఇండియన్స్ ఎక్కడ ఉన్నా తగ్గేదేలే.. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అసలు తగ్గేదేలే’ అంటూ అభిమానుల్లో జోష్ ని నింపే డైలాగ్స్ చెప్పాడు. అంతే కాకుండా యాంకర్ శ్రీముఖి గురించి మాట్లాడుతూ ‘శ్రీముఖి గారు..మీ యాంకరింగ్ మాత్రం రప్పా రప్పా’ అని చెప్పుకొచ్చాడు. గత కొంతకాలం గా తెలుగు రాష్ట్రాల్లో ‘రప్పా..రప్పా’ డైలాగ్ పై పెద్ద రాజకీయమే నడుస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ డైలాగ్ గురించి డిబేట్స్ పెట్టుకుంటున్నాయి. ఇది పుష్ప 2 చిత్రం లోని డైలాగ్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ మరోసారి దాని గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు ని అందుకున్నప్పుడు కూడా అల్లు అర్జున్ ఈ డైలాగ్ ని కొడుతాడు.
నిన్న జరిగిన TANA ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ పుష్ప 2 లోని డైలాగ్ చెప్తాడు. ముందుగా సుకుమార్ ని డార్లింగ్ ఏ డైలాగ్ చెప్పమంటావ్ అని అడుగుతాడు. అప్పుడు సుకుమార్ హింట్ ఇవ్వగా,అల్లు అర్జున్ ‘తెలుగోళ్లు అంటే ఫైర్ అనుకున్నావా..వైల్డ్ ఫైర్’ అంటూ ఫ్యాన్స్ ని ఉర్రూతలూ ఊగించే డైలాగ్ ఒకటి చెప్తాడు. అల్లు అర్జున్ మంచి ఉత్సాహం తో ఉండడం చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది డిసెంబర్ నెలలో అల్లు అర్జున్ కి ఎలాంటి పరాభవం ఎదురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట ఘటన లో రేవతి అనే మహిళా చనిపోవడం, శ్రీతేజ్ హాస్పిటల్ పాలవ్వడం,అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వంటివి జరిగాయి. అలాంటి సంఘటనలు చూసి అప్పట్లో అల్లు అర్జున్ చాలా డల్ గా ఉండేవాడు. ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు.
ఇండియన్స్ ఎక్కడ వున్నా తగ్గేదేలే
తెలుగువాళ్ళు అస్సలు తగ్గేదేలే#AlluArjun pic.twitter.com/eFb20aH1Hz— Telugu360 (@Telugu360) July 6, 2025