Pushpa: ‘అలవైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సీఫీసు వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. సుక్కు- బన్నీ కాంబోలో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ వచ్చింది. మరోవైపు రకరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్‌కు వస్తున్న భారీ బడ్టెట్ సినిమా కావడంతో.. ఎలా ఉంటుందో అని ఊహలు పెంచుకున్నారు ప్రేక్షకులు.
Also Read: 2021లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలివే..!
అయితే అనుకున్న స్థాయిలోనే తొలి రోజు భారీ వసూళ్లను కొల్లగొడుతూ రికార్డులు సృష్టించింది పుష్ప(Pushpa). ఈ సినిమా 5 భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అందులో హిందీ కూడా ఒకటి. అయితే, ఈ సినిమా హిందీ వర్షన్ వసూళ్లపై మొదటి నుంచి డైట్గానే ఉండేది. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ కావడం.. దానికి తోడు ఈ సినిమాపై వివాదం తలెత్తడం.. ఇవన్నీ పుష్పను అడ్డుకుంటాయేమో అని అందరూ భయపడుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో బన్నీ, ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలడా అని అందరూ అనుకున్నారు.
అయితే, బన్నీ దానికి కలెక్షన్ల రూపంలో సమాధానం చెప్పాడు. బాలీవుడ్‌లోనూ తొలిరోజు 3.1 కోట్ల వసూళ్లు చేసింది పుష్ప. సరైన ప్రమోషన్స్ లేకున్నా కూడా.. మంచి ఫిర్ రాబట్టి సత్తా చాటింది. ఇక రానున్న వారంలో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు ఏమేరకు రప్పిస్తుందో చూడాలి.
Also Read: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్కు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More