Allu Arjun self-driving car: టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రస్తుతం అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఎంజాయ్ చేస్తున్నంత పీక్ స్టార్ స్టేటస్ ని ఏ హీరో కూడా ఎంజాయ్ చేయడం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘పుష్ప’ సిరీస్ తో ఆయన క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది. మధ్యలో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆయన వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది కానీ, ఆ తర్వాత వెంటనే ఆ సమస్యల నుండి కోలుకొని,మళ్ళీ తన కెరీర్ ని చూసుకుంటున్నాడు. రీసెంట్ గానే ఆయన అట్లీ(Atlee) తో ఒకా భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది. ముందుగా మొదటి షెడ్యూల్ ని ముంబై లో షూట్ చేశారు, ఆ తర్వాత రెండవ షెడ్యూల్ ని ముంబై లో ప్లాన్ చేశారు.
Also Read: అది నాని డెడికేషన్… మేటర్ తెలిస్తే ఫ్యాన్ అయిపోతారు!
ఇక ఆ తర్వాత షెడ్యూల్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు కానీ, ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో మంచి ఛిల్ల్ మూడ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఆటోమేటిక్ డ్రైవింగ్ కారులో ఆయన తన కుటుంబం తో కలిసి చికారు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది జాగ్వార్ సంస్థకు చెందిన కారు. సెల్ఫ్ డ్రైవింగ్ దీని ప్రత్యేకత. కారులో ఉన్న LED స్క్రీన్ లో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ లో డెస్టినేషన్ ఫిక్స్ చేస్తే, ఇది నేరుగా అక్కడికి తీసుకెళ్లిపోతుంది. ఇలాంటి కార్లు మన టాలీవుడ్ లో చాలా తక్కువ మందికి ఉన్నాయి. ఆ తక్కువ మందిలో ఒకరు అల్లు అర్జున్. దీని ధర మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు.
Also Read: విడాకుల దిశగా హన్సిక..నోరు విప్పిన భర్త..ఇక ఎటు దారితీస్తుందో!
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో చేస్తున్న సినిమా విషయానికి వస్తే ఇందులో ఆయన ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 మంది హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారట. అందులో దీపికా పదుకొనే(Deepika Padukone), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఖరారు అయ్యారు. రీసెంట్ గానే రష్మిక మందాన కూడా ఖరారు అయ్యింది. ఇందులో ఆమె పూర్తి స్థాయి విలన్ క్యారక్టర్ లో కనిపించబోతుందని టాక్. హీరో అల్లు అర్జున్ తో ఆమెకు అనేక ఫైట్ సన్నివేశాలు కూడా ఉంటాయట. మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం జాన్వీ కపూర్ మరియు భాగ్యశ్రీ భొర్సే(Bhagyasri Bhorse) ని సంప్రదిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన రాబోతుంది.