Allu Arjun And Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సాధించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత రంగస్థలం సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా అవతరించాడు… ఇక తనతోపాటు అల్లు అర్జున్ సైతం తెలుగులో గొప్ప క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఎక్కడలేని క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…
గతంలో అల్లు అర్జున్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తనకు పోటీ కాదని తన సినిమాలు తనవని నా సినిమాలు నావి అంటూ అల్లు అర్జున్ మాట్లాడాడు. ఇక అప్పుడు ఆయన చెప్పిన మాటలను కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. మెగా అభిమానులకు కోపం వచ్చేలా రామ్ చరణ్ గురించి అల్లు అర్జున్ బ్యాడ్ గా మాట్లాడాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ – రామ్ చరణ్ ఇద్దరు బావ బామ్మర్దులు అవడం, చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక సినిమాలపరంగా పోటీ వాతావరణం ఉన్నప్పటికి దాన్ని వాళ్లు పర్సనల్ గా తీసుకోవడం లేదు. కేవలం సినిమాల వరకే నువ్వా నేనా అనే పోటీ అయితే సాగుతుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడు.
‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన రాబోయే సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే రామ్ చరణ్ సైతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా 200 కోట్ల మార్కును టచ్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తుండటం విశేషం…