Allu Arjun and Sandeep Reddy Vanga : గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆర్య సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. అప్పటి నుంచి వరుసగా మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. పుష్ప 2 సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…
Also Read : సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కాంబో లో రావాల్సిన సినిమా ఉంటుందా..?
అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టిందనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలోనే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డివంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏకంగా 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ఫౌజి (Fouji) సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు మరి తను అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగ అల్లు అర్జున్(Allu Arjun) తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట. ఆ ఒక్క సీన్ తోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది అంటూ సందీప్ రెడ్డి వంగ టీమ్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి ఇంతకీ ఆ సీను ఎలా ప్లాన్ చేశాడు, స్క్రీన్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడనే విషయాలు తెలియదు.
కానీ మొత్తానికైతే ఈ సినిమాతో అటు అల్లు అర్జున్ ఇటు సందీప్ రెడ్డి వంగ ఇద్దరు కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకు మించి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలందరూ రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నారు. అందులో అల్లు అర్జున్ కూడా భారీ ప్రణాళిక రూపొందించుకుంటున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read : అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగ మూవీ కి టైటిల్ ఫిక్స్..ఫ్యాన్స్ కి ఇక పూనకాలే!