Allu Arjun Raka Movie Story: ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియా లో రాబోయే స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమా గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరో పగలు పూట మనిషి లాగా ఉంటాడట, రాత్రి సమయం లో మాత్రం రాక్షసుడిగా మారిపోతాడట. ఇంతకీ ఎవరి సినిమా ఇది?, ఊహించగలరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమా అని అంటున్నారు కాబట్టి, కచ్చితంగా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోల సినిమాలే అయ్యుంటుంది. మహేష్ బాబు రాజమౌళి తో ‘వారణాసి’ చిత్రం చేస్తున్నాడు, ఆ సినిమా స్టోరీ ఇది అయ్యే అవకాశం కచ్చితంగా లేదు అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 వంటి చిత్రాలు చేస్తున్నాడు కాబట్టి , కచ్చితంగా ఆయనకు సంబంధించిన స్టోరీ కాదు. ఇక పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’, సురేందర్ రెడ్డి తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ ఆయన గ్యాంగ్ స్టర్ కాబట్టి, ఆయనకు సంబంధించిన స్టోరీ అయ్యే అవకాశమే లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన స్టోరీ కూడా కాదు. కాబట్టి ఇది కచ్చితంగా అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాకు సంబంధించిన స్టోరీ నే అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్రం లో బీస్ట్ గెటప్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ లుక్ ని విడుదల చేశారు. దీనిని బట్టి చూస్తుంటే ఇది కచ్చితంగా ‘రాకా’ కి సంబంధించినదే అని అంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర పాజిటివ్ కాగా , మరో పాత్ర నెగెటివ్ .
అయితే ఈ సినిమాకు మన పురాణాలకు కూడా లింక్ ఉందని అంటున్నారు. మన పురాణాల్లో తోడేళ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. సైన్స్ ఫిక్షన్ తో పాటు మైథాలజీ ని ఆధారంగా తీసుకొని చేస్తున్న ఈ చిత్రం లో పైన చెప్పిన పాయింట్ ని లింక్ చేస్తూ , మన ఇండియన్ సినిమా కమర్షియల్ లిబర్టీ ని జోడిస్తే , డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని ఒక మాస్టర్ పీస్ లాగా తయారు చేస్తున్నాడని , కచ్చితంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో రాబోయే రోజుల్లో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో దీపికా పదుకొనే , మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన వంటి వారు నటిస్తున్నారు.
