గ్రామ, వార్డ్ సచివాలయ ఫలితాలు విడుదల.. ఫలితాలు ఎలా తెలుసుకోవాలంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గత నెలలో 16,208 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది […]

Written By: Navya, Updated On : October 27, 2020 5:41 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గత నెలలో 16,208 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు.

రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయగా కరోనా, లాక్ డౌన్, వివిధ కారణాల వల్ల పరీక్షలకు 7.69 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. http://gramasachivalayam.ap.gov.in/‌ వెబ్ సైట్ ద్వారా పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 19 కేటగిరీలకు ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలను నిర్వహించింది.

గ్రామ, వార్డ్ సచివాలయాలలో వేర్వేరు ఉద్యోగాల కోసం మొత్తం 14 రకాల రాత పరీక్షలు జరిగాయి. గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు పరీక్షలు రాసిన అభ్యర్థుల యొక్క ఓ.ఎం.ఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేశారు. ఫలితాలలో పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో మరోసారి సమాధాన పత్రాలను పరిశీలించి ఫలితాలు విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు ఉన్నాయి.

ఈ గ్రామ సచివాలయాలతో పాటు 3786 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా జగన్ సర్కార్ ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా చేయడంతో పాటు పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం.