https://oktelugu.com/

  మళ్లీ వాయిదా పడిన అల్లు అర్జున్  ‘పుష్ప’.. కారణమెంటీ?

దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో గత ఆరేడు నెలలు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కావడంతో ‘పుష్ప’ మూవీ కూడా పట్టాలెక్కుతుందనే టాక్ విన్పించింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో స్టార్ హీరోలు సినిమాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 11:32 AM IST
    Follow us on


    దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో గత ఆరేడు నెలలు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కావడంతో ‘పుష్ప’ మూవీ కూడా పట్టాలెక్కుతుందనే టాక్ విన్పించింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో స్టార్ హీరోలు సినిమాలు చేసేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఒక్కొక్కరుగా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం. దీంతో అల్లు అర్జున్ సైతం ‘పుష్ప’ మూవీని లైన్లో పెట్టేందుకు దర్శకుడు సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    Also Read: బిగ్ బాస్ ఎంట్రీతో అవినాష్ కు జబర్దస్ గేట్లు క్లోజ్..!

    ఈక్రమంలోనే ‘పుష్ప’ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. రంపచోడవరం..మారేడిపల్లి ప్రాంతాల్లో షూటింగ్ కోసం ప్లాన్ చేశారు. ఇందుకోసం వూడ్స్ రిసార్ట్.. రాజమండ్రిలోని కొన్ని హోటళ్లను చిత్రయూనిట్ బ్లాక్ చేసింది. అయితే అనివార్య కారణాలతో షూటింగ్ మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

    Also Read: గుడ్ న్యూస్: మెగా డాటర్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే?

    ‘పుష్ప’ మూవీ షూటింగు కోసం అటవీ ప్రాంతంలో సెట్స్ వేస్తున్నారు. అయితే ఇంకా పూర్తికాకపోవడంతో షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సెట్స్ పూర్తవడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుందని సమాచారం. దీంతో షూటింగ్ ఈనెల 8 లేదా 9 తేదిల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. కీలక ఫైట్స్ ఈ షెడ్యూల్లో ఉండటంతో స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఈమేరకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.