Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: అల్లు అర్జున్ "పుష్ప" సినిమా హిందీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే...

Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” సినిమా హిందీ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే…

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా నిన్న దీని ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. అలానే కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ మొదట ఐదు భాషల్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. కానీ పలు కారణాల చేత హిందీ మినహా మిగతా భాషల్లో ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

allu arjun pushpa movie hindi trailer release datails

దీనితో హిందీ వెర్షన్ ట్రైలర్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఓ కన్ఫర్మేషన్ అప్డేట్ ని ఇచ్చేసారు. హిందీ యూట్యూబ్ ఛానల్ గోల్డ్ మైన్స్ టెలి ఫిల్మ్స్ వారు ట్రైలర్ లాంచ్ ఈరోజే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి హిందీ వెర్షన్ ట్రైలర్ కి, తెలుగు వెర్షన్ ట్రైలర్ కి ఏమన్నా మార్పులు చేసారా, లేదా ఒకేలా ఉంటుందా అనేది తెలియాలంటే కొన్ని గంటలు ఆగక తప్పదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version