Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 The Rule Twitter Review : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ: థియేటర్స్...

Pushpa 2 The Rule Twitter Review : పుష్ప 2 ట్విట్టర్ రివ్యూ: థియేటర్స్ బ్లాస్ట్, పుష్పరాజ్ విధ్వంసం, ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే?

Pushpa 2 The Rule Twitter Review : అల్లు అర్జున్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది పుష్ప 2. మూడేళ్ళ క్రితం విడుదలైన పుష్ప చిత్రానికి ఇది కొనసాగింపన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ వచ్చి చాలా కాలం అవుతున్న ఈ క్రేజీ సీక్వెల్ పై హైప్ ఇసుమంత కూడా తగ్గలేదు. పైగా అంతకంతకు పెరుగుతూ పోయింది. అలాగే మూవీ చిత్రీకరణ ఆలస్యమైంది ఆగస్టులో విడుదల కావాల్సింది.. డిసెంబర్ కి వాయిదా పడింది. విడుదలకు పది రోజుల ముందు కూడా షూటింగ్ జరుగుతూనే ఉంది. అంతగా ఈ చిత్రం కోసం యూనిట్ కష్టపడ్డారు.

వారి కష్టానికి ఫలితం దక్కిందా? ప్రేక్షకుల అంచనాలు ఈ మూవీ అందుకుందా? అంటే అవుననే చెప్పాలి. మెజారిటీ ఆడియన్స్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, ప్రముఖ రివ్యూవర్ ఏకంగా 4.5 రేటింగ్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు… మూవీ ఎలా ఉందో. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన హైలెట్. అల్లు అర్జున్ ప్రెజెన్స్, ఎనర్జీ, మేనరిజమ్స్ గూస్ బంప్స్ రేపుతాయి. అల్లు అర్జున్ పాత్రకు సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయట.

సాంగ్స్ కూడా సినిమాకు ప్రధాన బలం అంటున్నారు. ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారట. కథలో ట్విస్ట్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ కి హై ఇచ్చే మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయట. పీలింగ్ సాంగ్, హెలికాఫ్టర్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్ కి ప్రధాన ఆకర్షణ అంటున్నారు. సుకుమార్ కమర్షియల్ ఫార్మాట్ లో తీసినప్పటికీ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారట.

రష్మిక పాత్ర బాగుంది. అల్లు అర్జున్, రష్మిక మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాలు ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ పార్ట్ కూడా ఉంది అనేది ఆడియన్స్ అభిప్రాయం.క్లైమాక్స్ తో పాటు సెకండ్ హాఫ్ మరింత హై ఇచ్చేలా ఉందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక పుష్ప 2 లో మైనస్ లో చెప్పాలంటే.. ఫహద్ ఫాజిల్ రోల్ ఊహించినంత స్ట్రాంగ్ గా లేదని అంటున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ అద్భుతం అట మొత్తంగా పుష్ప 2 మాస్ ఆడియన్స్ ఆద్యంతం ఎంజాయ్ చేసే పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామా. అల్లు అర్జున్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం..

RELATED ARTICLES

Most Popular