https://oktelugu.com/

Allu Arjun Puspha-2: అంతర్జాతీయ మాఫియా వరకూ వెళ్ళబోతున్న పుష్ప 2 !

Allu Arjun Puspha-2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొత్తానికి బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా తన ప్రభావాన్ని బాగానే చూపించింది. అయితే, పుష్ప-1లో పుష్ప రాజ్‌ సిండికేట్‌ రాజుగా ఎలా ఎదిగాడో చూపెట్టారు. అన్ని భాషల్లో ఈ చిత్రం ఘనవిజయం సాధించగా, ఇప్పుడు అందరి దృష్టి పుష్ప-2 ఎలా ఉండబోతోంది అనేదాని పైనే ఉంది. ఈ క్రమంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 14, 2022 / 12:54 PM IST
    Follow us on

    Allu Arjun Puspha-2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొత్తానికి బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా తన ప్రభావాన్ని బాగానే చూపించింది. అయితే, పుష్ప-1లో పుష్ప రాజ్‌ సిండికేట్‌ రాజుగా ఎలా ఎదిగాడో చూపెట్టారు. అన్ని భాషల్లో ఈ చిత్రం ఘనవిజయం సాధించగా, ఇప్పుడు అందరి దృష్టి పుష్ప-2 ఎలా ఉండబోతోంది అనేదాని పైనే ఉంది.

    Allu Arjun, Sukumar

    ఈ క్రమంలో రెండో భాగానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప-2లో హీరో పాత్ర, సిండికేట్‌లో విలన్ల ఎత్తుగడలను ఎదుర్కొంటూనే ముంబై మాఫియా, ఆతర్వాత జపాన్‌ వంటి అంతర్జాతీయ మాఫియా వరకూ వెళ్తుందని తెలుస్తోంది. మొత్తానికి ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి ‘అల్లు అర్జున్’ చేసిన ఈ పాన్ ఇండియా ప్రయత్నం పర్వాలేదు అనిపించుకుంది.

    Also Read: KCR Job Notification Announcement: కేసీఆర్ సార్ ప్రకటన అయిపాయే.. నోటిఫికేషన్లు ఎప్పుడు సార్?

    ముఖ్యంగా పుష్పలో డైలాగ్స్‌ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాయలసీమ స్లాంగ్‌లో అల్లు అర్జున్‌ పలికించిన డైలాగ్‌ లు అధ్భుతంగా ఉన్నాయి. పైగా పుష్ప డైలాగ్స్ కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో గొప్ప హిట్ అయ్యాయి. అన్ని డైలాగ్స్‌ కు మంచి స్పందన వచ్చింది. ‘పుష్ప’కు అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    కాగా ఈ సినిమా కలెక్షన్స్ పూర్తయ్యేసరికి అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.195.5 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే ఈ కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసింది. పైగా మిగిలిన అన్ని రైట్స్ తాలూకు డబ్బులు అన్నీ లాభాల కిందకే వస్తాయి.

    Also Read: Janasena Guidelines: జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు

    Tags