Homeజాతీయ వార్తలుTelangana BJP: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

Telangana BJP: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

Telangana BJP: ‘పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిన’ చందంగా మారింది బీజేపీలో కొంతమంది నాయకుల తీరు. తెలంగాణలో అధికారంలోకి రాకముందే అప్పుడే ‘సీఎం’ కలలు కంటున్నారు. పార్టీలో సీఎం అభ్యర్థిపై అప్పుడే ఆధిపత్యపు పోరాటాలు బీజేపీలో జరగడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునేవారు బీజేపీలో సీఎంలు కాలేరని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇటీవల వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారుతోందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Telangana BJP
Telangana BJP

బీజేపీ ప్రస్తుతం దేశంలో ఫుల్ ఫామ్ లో ఉంది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు వణుకు పుట్టిస్తోంది. కేంద్రంలో అధికారం అండతో కేసీఆర్ ను ధీటుగా ఢీకొడుతోంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ప్రజల్లోనూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ నమ్మకం కలిగిస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ నియామకం తర్వాత పార్టీకి ఓ రేంజ్‌లో మైలేజీ వచ్చింది. అప్పటి వరకు ఉందా.. లేదా అన్నట్లుగా ఉన్న పార్టీ ఇప్పుడు అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అనే స్థాయికి ఎదిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా బీజేపీ పేరు లేకుండా.. రాష్ట్రంలోని బీజేపీ నాయకుల గురించి మాట్లాడకుండా ప్రెస్‌మీట్‌ నిర్వహించలేని స్థాయికి రావడమే పార్టీ ఏమేరకు బలపడిందనడానికి నిదర్శనం. అయితే ఇటీవల బీజేపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో పార్టీకి నష్టం కలుగిస్తాయనే చర్చ జరుగుతోంది.

Also Read: Tirupati Incident: రాజకీయాల్లోకి ‘శ్రీవారిని’ లాగుతుందెవరు?

-అధికారంలోకి వచ్చేంత బలపడిందా..
తెలంగాణలో బీజేపీ బలపడిన మాట నిజమే.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజారాబాద్‌ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి మరింత ఊపు వచ్చింది. అయితే ఈ విజయాలతోనే కొంతమంది నాయకులు వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి తానంటే .. తాను అనే చర్చ కూడా మొదలు పెట్టారు. పార్టీలో ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరుగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునేవారు బీజేపీలో సీఎంలు కాలేరని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇటీవల వ్యాఖ్యానించడాన్ని బట్టి పార్టీలో ఇప్పటి నుంచే సీఎం పదవికి పోటీ నెలకొందా అనిపిస్తోంది. అధికారంలోకి రావాలనే ఆశ ప్రతీ రాజకీయ పార్టీలో ఉంటుంది. కచ్చితంగా వస్తామన్న ఆత్మ విశ్వాసమూ ఏదో ఒకదశలో ఏర్పడుతుంది. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఆ దశలోనే ఉందనడంలో సందేహం లేదు. అయితే కొంతమంది ఎన్నికలు జరిగి అధికారంలోకి రాకముందే ముఖ్యమంత్రి పదవిపై చర్చ జరుపడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

-దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత..
దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి జోష్‌ వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఫలితాలు పార్టీలో ఆత్మవిశ్వాసం పెంచాయి. అయితే ఈ ఫలితాలతోనే పార్టీ తెలంగాణ అంతటా బలపడినట్లు భావించలేం. దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి, ఇక్కడి విజయాల్లో పార్టీతోపాటు అభ్యర్థులు కూడా కీలకం అన్నది వాస్తవం. హుజూరాబాద్‌లో అయితే టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ వ్యక్తిగత విజయంగా కూడా కొందరు భావిస్తారు. బీజేపీ నేతలు ఈ విషయం బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా అంగీకరించాల్సిన అంశం. అయితే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బూస్ట్‌ ఇచ్చాయనడంలో సందేహం లేదు. దీనికి తగినట్లుగానే ఇటీవల సర్వే నిర్వహించిన కొన్ని సంస్థలు తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని తెలిపాయి.

Telangana BJP
Bandi Sanjay

ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీజేపీకి ఆరు సీట్లు వస్తాయని కూడా అంచనా వేశారు. అధికార టీఆర్‌ఎస్‌ బలం 9 సీట్ల నుంచి 8 కి తగ్గుతాయిని సర్వేలు అంచనా వేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఓ సీటు కోల్పోతుందని ప్రకటించాయి. అయితే.. లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫలితాలు ఉండాయని భావించలేం. ఇందుకు 2018 అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది. అంతకు ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్కస్థానంలోనే విజయం సాధించింది. 100కుపైగా స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మేనియా పనిచేసిందని ఫలితాలు నిరూపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావం చూపుతాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఎంత పెరిగితే అంత బీజేపీకి కలిసి రావొచ్చు. అయితే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా.. బీజేపీతోపాటు కాంగ్రెస్‌ కూడా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ ముందు ఉన్నట్లు కనిపిస్తోంది.

-బీజేపీకి అభ్యర్థుల కొరత..
నిజానికి బీజేపీకి రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు లేరు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీ చీల్చితే టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం సులభం అని భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ ఊహించిన దానికన్నా బీజేపీ రాష్ట్రంలో బలపడితే మాత్రం టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసి కొట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ కంటే బీజేపీనే ప్రత్యామ్నాయం అని భావిస్తే రాష్ట్రంలో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇదంతా బీజేపీ నేతలు చేసే పోరాటాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో ఎంత పెంచితే బీజేపీ విజయావకాశాలు అంతగా పెరుగుతాయి. ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా ఆపరేషన్‌ కూడా ఈ దిశగానే ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అంతర్గత సమస్యలను వెంటనే చక్కబెట్టక పోతే మాత్రం పార్టీకి నష్టమే అని పేర్కొంటున్నారు.

Also Read:JanaSena Party: ఉత్తరాంధ్ర జనసేనకు ఆయువు పట్టుగా మారుతోందా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

4 COMMENTS

  1. […] Vastu Tips: వాస్తు విషయంలో ఎంతో మంది ఎన్నో విషయాలు చెబుతుంటారు. భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్య‌త‌నిస్తారు. వాస్తు నియమాలు మనిషి జీవితం సాఫీగా సాగడానికి ఉప‌క‌రిస్తాయ‌ని న‌మ్ముతారు. ప్రతి వాస్తు నిబంధన వెనుక శాస్త్రీయ కారణం ఉంటుందంటారు. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంద‌ని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఏ పక్కన ఉండాల్సింది అక్కడే లేకుంటే ఆర్థిక సంక్షోభాన్ని దారి తీయొచ్చు లేదా కుటుంబ కలహాలకూ కారణం కావొచ్చు. ఇంటి దక్షిణ దిశలో కొన్ని అస్స‌లు ఉండకూడద‌ని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. […]

  2. […] Pan Card: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. మనకు తెలియకుండానే మన ఖాతాలోని డబ్బులు మాయం కావడం చూస్తూనే ఉన్నాం. ఇంకా మన ప్రమేయం లేకుండానే మన పేరు మీద రుణం తీసుకునే వీలుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తు.న్నారు అపరిచితులకు మీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెబుతున్నారు. […]

  3. […] Viral News: మ‌నిషికి తోక ఉండ‌టం మీరు ఎప్పుడైనా చూశారా.. సాధార‌ణంగా జంతువుల‌కు క‌దా తోక ఉండేది. మ‌రి మ‌నుషుల‌కి ఎలా ఉంట‌ది.. అనుకుంటున్నారా.. ప్రపంచంలో ఎన్నో వింత‌లు చూశాం. రెండు తల‌ల‌తో శిశువు జ‌న్మించ‌డం.. అద‌నంగా చేతి వేళ్లు ఉండ‌టం.. పిల్లికి కుక్క పాలివ్వడం, మూడు కన్నులతో గేదె జన్మించడం, గుడి చూట్టూ జంతువులు ప్రదక్షిణలు చేయడం.. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటలను చూశాం. ఇలాంటిదే నేపాల్‌కు చెందిన ఓ యువకుడి విషయంలో కూడా జరిగింది. అతడికి వెన‌క భాగంలో తోక ఉంది. వీపు నుంచి పొడవైన తోక బయటకు రావడంతో.. నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు. నేపాల్ లోని ఓ యువ‌కుడికి తోక ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. […]

  4. […] Rahul Gandhi Visit To Telangana: కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన బలం నిరూపించుకోవాలని చూస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తరువాత జరుగుతున్న పరిణామాలతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఇక ప్రస్తుతం తెలంగాణలో పార్టీని మరోమారు అధికారంలోకి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు నిర్ణయించుకుంది. […]

Comments are closed.

Exit mobile version