Pushpa 2 Climax: పుష్ప 2 క్లైమాక్స్ లీక్… వందల లారీలతో పుష్పరాజ్ వీరంగం!

పుష్ప 2 విడుదలకు ముందే వెయ్యి కోట్ల బిజినెస్ ఆఫర్ అందుకుందని సమాచారం. ఓ సంస్థ పుష్ప 2 అన్ని భాషల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు రూ. 1000 కోట్లు ఆఫర్ చేసిందట.

Written By: Shiva, Updated On : September 7, 2023 1:36 pm

Pushpa 2 Climax

Follow us on

Pushpa 2 Climax: కీలకమైన పుష్ప 2 క్లైమాక్స్ లీకైంది. వందల లారీలతో పుష్పరాజ్ వీరంగం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప సక్సెస్ నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. అదే క్రమంలో అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తం అయ్యింది. నార్త్ ఫ్యాన్స్ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన ”వేర్ ఈజ్ పుష్ప?” హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఇందుకు నిదర్శనం.

పుష్ప 2 విడుదలకు ముందే వెయ్యి కోట్ల బిజినెస్ ఆఫర్ అందుకుందని సమాచారం. ఓ సంస్థ పుష్ప 2 అన్ని భాషల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు రూ. 1000 కోట్లు ఆఫర్ చేసిందట. పుష్ప 2 బడ్జెట్ రూ. 300- 350 కోట్లని సమాచారం. మరి వెయ్యి కోట్ల ఆఫర్ అంటే నిర్మాతలకు భారీ లాభాలు దక్కినట్లే లెక్క. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ఈ న్యూస్ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది.

తాజాగా పుష్ప 2 సెట్స్ నుండి ఓ వీడియో లీక్ అయ్యింది. పాత కాలానికి చెందిన వందల లారీలు ఓ చోట పార్క్ చేసి ఉన్నాయి. ఈ లారీలు అన్నింటినీ పుష్ప 2 క్లైమాక్స్ సీన్ కోసం తెప్పించారనే ప్రచారం జరుగుతుంది. పుష్ప రాజ్ క్లైమాక్స్ లో వందల కొద్దీ లారీల్లో ఎర్ర చందనం లోడ్ చేసి విదేశాలకు తరలించే ప్రయత్నం చేస్తాడట. ఆ సీన్ కోసమే సుకుమార్ ఇన్ని లారీలు తెప్పించాడని అంటున్నారు.

ఈ క్రమంలో కొందరు కెజిఎఫ్ 2 క్లైమాక్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఆ చిత్రంలో రాకీ భాయ్ తవ్వి తీసిన బంగారం మొత్తం షిప్ లో వేసుకుని విదేశాలకు తరలించబోయి అధికారుల దాడిలో మరణిస్తాడు. పుష్ప రాజ్ సైతం ఎర్ర చందనం లారీల్లో నింపి తరలిస్తాడని అంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. పుష్ప 2 సెట్స్ లో భారీ ఎత్తున లారీలు ఏ సన్నివేశం కోసం ఉంచారనేది మూవీ విడుదలైతే కానీ తెలియదు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్…