Allu Arjun and Priyadarshi : గత ఏడాది నేషనల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో మారుమోగిపోయిందో మనమంతా చూసాము. ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం సంచలన విజయం సాధించడం అందుకు ఒక కారణం కాగా, ప్రీమియర్ షోస్ రోజున అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సంధ్య థియేటర్ కి రావడం, ఆ సందర్భంలో అక్కడ జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఉండడం వంటివి జరిగాయి. శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యస్తుడిగా ఎప్పుడు బయటకు వస్తాడో ఇప్పటికీ తెలియని పరిస్థితి. ఈ ఘటన విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత మరుసటి రోజున బెయిల్ మీద బయటకు రావడం వంటివి సంఘటనలు పెను దుమారం రేపాయి. అయితే బెయిల్ దొరకడం అంత సులువైన విషయం కాదు, ఇప్పట్లో బయటకు రావడం కష్టమే అని అనుకుంటున్న సమయంలో లాయర్ నిరంజన్ రెడ్డి రంగం లోకి దిగాడు.
Also Read : చంచల్ గూడ జైలులో అల్లు అర్జున్ కి అంత అవమానం జరిగిందా?… నాకు ఎదురైదే ఆయనకు కూడా అంటూ, బాంబు పేల్చిన నటి!
ఆ రోజు కోర్టు లో ఆయన వాదించిన తీరుకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. దానికి సంబంధించిన వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉండగా ఈ నెల 14వ తారీఖున నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్'(Court Movie) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రియదర్శి(Priyadarshi) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి, ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి గారు కోర్టు లో కొన్ని చట్టాల గురించి ఆయన వాదించినవి చూసి మా సినిమా కోర్ట్ రూమ్ సన్నివేశాలకు డబ్బింగ్ మార్చాము. దాని వల్ల ఇప్పుడు ఆ సన్నివేశాలు చాలా రియాలిటీ కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇటీవలే విడుదలైన ‘కోర్ట్’ మూవీ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నాని ఒక సినిమాలో హీరో గా నటించినా, ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించినా ఆ సినిమా మినిమం గ్యారంటీ లెవెల్ లో ఉంటుందని ఆడియన్స్ లో ఒక నమ్మకం ఏర్పడింది. హీరోగా ఆయన నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి కానీ, నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో ఇప్పటి వరకు ఆయన ఒక్క ఫ్లాప్ చిత్రాన్ని కూడా అందుకోలేదు. అలాంటి బలమైన స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటూ వచ్చాడు. ఈ సినిమాతో పాటు ఆయన హీరో గా నటించిన ‘హిట్ 3’ కి కూడా నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకు ఆయన బడ్జెట్ కూడా భారీ రేంజ్ లోనే పెట్టినట్టు తెలుస్తుంది. అదే విధంగా ‘దసరా’ డైరెక్టర్ తో కలిసి ఆయన చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Also Read : మిస్టర్.. కామెంట్ చేసే ముందు జాగ్రత్త.. ప్రియదర్శికి ఇచ్చి పడేసిన నభా నటేష్