Allu Arjun: అల్లు అర్జున్ ఇమేజ్ పుష్ప కి ముందు తర్వాత అని చెప్పాలి. అల్లు అర్జున్ ని పుష్ప అంతగా ఫేమస్ చేసింది. ముఖ్యంగా పుష్ప హిందీ వర్షన్ హిట్ టాక్ తెచ్చుకోవడం అల్లు అర్జున్ కి కలిసొచ్చింది. పాన్ ఇండియా హీరో కావాలన్న ఆయన కలల్ని నెరవేర్చింది. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. పుష్ప హిందీ వర్షన్ ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది ఊహించని పరిణామం.

తెలుగు నేటివిటీతో తెరకెక్కిన పుష్ప హిందీలో విజయం సాధించడం కష్టమేనన్న మాట వినిపించింది. ఆ ఊహాగానాలు తలకిందులు చేస్తూ పుష్ప భారీ సక్సెస్ అందుకుంది. ఇక పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన రిలాక్స్ కావడం కోసం దుబాయ్ వెళ్లారు. దుబాయ్ ట్రిప్ ముగించుకొచ్చిన అల్లు అర్జున్ తన పిల్లలతో గడిపేస్తున్నారు. అల్లు అర్జున్ కి పిల్లలంటే పంచ ప్రాణాలు. ముఖ్యంగా కూతురు అర్హతో గడపడానికి ఆయన ఇష్టపడతారు.
అర్హతో వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం అల్లు అర్జున్ కి భలే సరదా. కఠినమైన షూటింగ్స్ షెడ్యూల్స్ నుండి కుటుంబంతో గడపడం ద్వారా అల్లు అర్జున్ రిలాక్స్ అవుతారు. కాగా త్వరలో పుష్ప 2 షూటింగ్ మొదలు కానుంది. దీనితో ఈ ఖాళీ సమయాన్ని ఆయన పిల్లలతో గడుపుతూ ఆహ్లాదం పొందుతున్నారు. అర్హ, అయాన్ లతో పాటు చిన్నపిల్లాడిలా ఆడుకుంటున్న అల్లు అర్జున్ వీడియోను భార్య స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
టి షర్ట్, షార్ట్స్ ధరించిన అల్లు అర్జున్ ఆట వస్తువులతో ఏదో చేస్తుంటే… అర్హ ఆసక్తిగా గమనిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక పుష్ప ది రూల్ షూటింగ్ కొంత భాగం ఇప్పటికే పూర్తి అయ్యింది. మిగిలిన భాగం షూట్ చేయాల్సి ఉంది. 2022లో పుష్ప పార్ట్ 2 విడుదల కానుంది. పుష్ప పార్ట్ 1 విజయం నేపథ్యంలో సీక్వెల్ పై మరింత హైప్ నెలకొంది. పార్ట్ వన్ లో రెడ్ శాండల్ స్మగ్లింగ్ లో కూలీగా కనిపించిన అల్లు అర్జున్.. పార్ట్ 2 లో సిండికేట్ ని కంట్రోల్ చేసే కింగ్ గా కనిపించనున్నారు.
పోలీసు అధికారి పాత్ర చేస్తున్న ఫహద్, అల్లు అర్జున్ మధ్య నడిచే ఆధిపత్య పోరే ప్రధానంగా పార్ట్ 2 ఉండనుందని పుష్ప క్లైమాక్స్ చూస్తే అర్థం అవుతుంది. దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రానికి దర్శకత్వం వహించగా … రష్మిక హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ సంగీతం అందించారు. సమంత ఓ ఐటెం సాంగ్ చేశారు.