
కరోనా ఎఫెక్ట్ షూటింగ్ లతో పాటు ,నటీ నటుల కాల్ షీట్స్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది నెలలు . గ్యాప్ రావడం తో ఆర్టిస్టులు తమ డేట్స్ అద్జుస్త్ చేసుకొవడం తప్పనిసరి అయ్యింది i. ఆ క్రమంలో నటులు కొన్ని సినిమాలు కూడా వాదులు కొంటున్నారు .
పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న రి ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కి ఇప్పుడు హీరోయిన్ కాల్ షీట్ ప్రాబ్లెమ్ వచ్చింది . ప్రస్తుతం సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఓ హీరోయిన్ నటించాలి ఆ క్యారెక్టర్ తప్పనిసరి అని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ భావించింది. ఆ క్రమంలో శృతిహాసన్ పేరు ప్రముఖం గా వినిపించింది. కానీ శృతి హాసన్ ప్రస్తుత పరిస్థితిలో తాను పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం లేదనే విషయాన్ని తేల్చేసింది. దీంతో చిత్ర యూనిట్ ఇలియానాను నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది గతంలో ఇలియానా పవన్కల్యాణ్తో కల్సి జల్సా సినిమాలో నటించగా ఆ చిత్రం సక్సెస్ కూడా అయ్యింది .
బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్ రాజు , శిరీష్ నిర్మాతలుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక ‘వకీల్సాబ్’ సినిమా విడుదల విషయానికి వస్తే.. ముందుగా మే 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మారిన పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పెండింగ్ షూటింగ్ పూర్తి చేసి తర్వాత సినిమా విడుదల గురించి ఆలోచిస్తారట… కాగా వకీల్ సాబ్ ఆగస్ట్ లేదా దసరాకు విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు .