Allu Arjun Lokesh Kanagaraj Movie: తెలుగు సినిమా ఇండస్ట్రిలో స్టైలిష్ స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ వరుస సినిమాలను చేస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న రాకా సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే లోకేష్ కనకరాజు సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ మేకవర్లో కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో అతను మూడు గెటప్పుల్లో కనిపించబోతున్నాడు మరి వీటి కోసం ఆయన విపరీతంగా కష్టపడి ఎలాగైనా సరే ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక లోకేష్ కనకరాజు ఇప్పటికే అల్లు అర్జున్ కి లుక్ ల గురించిన టెస్టులైతే చేస్తున్నారట. మొత్తానికైతే రాకా సినిమా పూర్తి అయిన తర్వాత ఫుల్ టైమ్ ఈ సినిమా మీద అల్లు అర్జున్ వర్క్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ను సాధిస్తే అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం తార స్థాయికి వెళ్ళిపోతుంది.
లోకేష్ సైతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గాఅవతరిస్తాడు. వీళ్లిద్దరు కలిసి చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే కలెక్షన్స్ ని కొల్లగొట్టగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
