Allu Arjun-Nani : టాలీవుడ్ లో కొన్ని క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ గతం లో ఆ మల్టీస్టార్రర్ సినిమా కార్య రూపం దాల్చే వరకు వచ్చి ఆగిపోయాయి అనే విషయం తెలుసుకొని అయ్యో అని బాధపడుతుంటాము. సరిగ్గా అలాంటి కాంబినేషన్ ఒకటి మిస్ అయ్యింది. అల్లు అర్జున్(Icon Star Allu Arjun), నాని(Natural Star Nani) కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం లో ఒక సినిమా సిద్దమై ఐదేళ్లు దాటింది. ఫక్తు కమర్షియల్ కమ్ ఫ్యామిలీ డ్రామా చిత్రమిది. అయితే అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత బాగా మారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక రీజినల్ సబ్జెక్టు ని మాత్రమే సిద్ధం చేశాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ సినిమాలు తప్ప, ప్రాంతీయ బాషా చిత్రాలు చేయడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళింది.
Also Read : మహిళా దర్శకురాలికి చేయూత..నిర్మాతగా నిహారిక కొణిదెల 2వ చిత్రం మొదలు!
ఈ ప్రాజెక్ట్ కి బదులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కోసం ఒక పాన్ ఇండియన్ సబ్జెక్టు ని రెడీ చేశాడు. మన పురాణాలకు సంబంధించిన కథని ఎంచుకొని చేస్తున్నాడు. సుబ్రమణ్య స్వామి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ముందుగా ఈ సినిమానే మొదలు అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, స్క్రిప్ట్ పూర్తి స్థాయి లో సిద్ధం అవ్వడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున, ముందుగా ఆయన అట్లీ తో చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు. మరి నాని తో ప్లాన్ చేసిన మల్టీస్టార్రర్ ఇక ఉండదా అంటే, అల్లు అర్జున్ తో ఉండదని తెలుస్తుంది. ఇదే కథలో కాస్త మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), నాని కాంబినేషన్ లో తెరకెక్కించాలని త్రివిక్రమ్ చాలా కాలం నుండి ప్లానింగ్ లో ఉన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ చివరి సినిమా అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్, నాని కి సోషల్ మీడియా లో మ్యూచువల్ అభిమానులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిని ఒకరు అభిమానించుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాలలో నాని గురించి మంచిగా మాట్లాడడం మనమంతా చూసాము. మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా చూసే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ పీక్ రేంజ్ లో అనిపిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే మూవీ లవర్స్ కూడా అల్లు అర్జున్, నాని కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.
Also Read : తమిళ స్టార్ హీరోని ‘బెగ్గర్’ గా మార్చేసిన పూరి జగన్నాథ్..