Allu Arjun Lokesh Kanagaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి తమిళ్ సినిమాలేవి ఆశించిన మేరకు విజయాలను సాధించడం లేదు. కారణం ఏదైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులకు వచ్చిన క్రేజ్ తమిళ్ సినిమా ఇండస్ట్రీ దర్శకులకు రావడం లేదు. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాని చేయడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. తమిళ్ హీరోలైతే మరి దారుణంగా తయారయ్యారు. ఒకప్పుడు సౌత్ లో మా ఇండస్ట్రీ నే టాప్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకొని తిరిగిన తమిళ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు… ఇక తమిళ్ ఇండస్ట్రీ దర్శకులు సైతం తమిళ్ హీరోలతో పని అవ్వదని బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సినిమాలను చేస్తున్నారు. తమ ఖాతాలో సూపర్ సక్సెస్ లను వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అట్లీ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇందులో ఇండియా మొత్తాన్ని షేక్ చేసే క్యారెక్టర్ లో అల్లు అర్జున్ కనిపిస్తాడట. ‘పుష్ప’ సినిమాను మించి ఇందులో ఎలివేషన్ ఉంటాయట… ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన పాత్రలన్నింటి కంటే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందంటూ మేకర్స్ అయితే చెబుతున్నారు. ఇక వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
తద్వారా ఈ సినిమాతో ఆయన తనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. లోకేష్ కనకరాజు గతంలో చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించినప్పటికి రజినీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో ఆయన భారీగా దెబ్బతిన్నాడు. అప్పటినుంచి అతనితో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు భయపడిపోతున్నారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం ధైర్యంగా స్టెప్ వేసి మరి అతనితో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. లోకేష్ కనకరాజు చాలా మంచి మేకర్ ఆయన ఎలాంటి సినిమానైనా సరే సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే సత్తా ఉన్న దర్శకుడు కావడం వల్ల అతనికి అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది…