Allu Arjun: అల్లు అర్జున్ కి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట…

పుష్ప సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Written By: Gopi, Updated On : March 20, 2024 5:17 pm

Allu Arjun likes that heroine very much

Follow us on

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ తెలుగులో భారీ సక్సెస్ లను అందుకున్నడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన యాక్టింగ్ చేసిన బాలీవుడ్ జనాలు ఆయనకి అభిమానులుగా మారిపోయారు. ఇక పుష్ప సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడం తో అల్లు అర్జున్ పైన ప్రెజర్ ఎక్కువగా పెరిగింది.

ఇక దానికి తగ్గట్టుగానే పుష్ప సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడమే కాకుండా వాటిని రీచ్ అయ్యే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టమట. ఆయన ఆవిడ ఫ్యాన్ అని కూడా చాలా సందర్భాల్లో తెలియజేశాడు.

ఆమె ఎవరు అంటే ఒకప్పటి లెజెండరీ నటిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘మహానటి సావిత్రి’… నిజానికి సావిత్రి గారు పోషించిన పాత్రలని ఆ తర్వాత వచ్చిన హీరోయిన్స్ ఎవరు పోషించలేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న హీరోయిన్లలో ఆమెను మ్యాచ్ చేసే హీరోయిన్ ఒకరు కూడా లేరనే చెప్పాలి. ఆమె చూడగానే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసే విధంగా ఉండేది. అలాగే ఏ పాత్రలోనైనా హావాభావాలను పలికించే విధంగా నటించి మెప్పించడం ఆమెలో ఉన్న ప్లస్ పాయింట్స్ వీటివల్లే అల్లు అర్జున్ కు ఆమె అంటే చాలా ఇష్టమట.

ఒకవేళ ఆవిడ ఇప్పుడు ఉంది ఉంటే ఆమెతో పాటు ఒక సినిమా కూడా చేసేవాణ్ణి అంటూ అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు సాధించలేని ఒక గొప్ప ఘనతను సాధించాడు. అది ఏంటి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఏ హీరోకి దక్కని ‘నేషనల్ అవార్డు’ ను దక్కించుకుని తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి…