
తాను నటించే కొత్త సినిమా ` పుష్ప ` కోసం అల్లు అర్జున్ జుట్టు, గడ్డం బాగా పెంచాడు. సహజత్వం కోసం కటింగ్ చేయించుకోకుండా చింపిరి జుట్టు, చింపిరి గడ్డం ఉంచేద్దాం అనుకున్నాడు. అయితే షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా వచ్చి పడింది. రెండు నెలలుగా షూటింగ్ లు బంద్ అయ్యాయి. ఈ అరవై రోజుల్లో అల్లు అర్జున్ జుట్టు, గడ్డం ఇంకా పెరిగింది. దీంతో కటింగ్ చేయించుకోక తప్పడం లేదని తెలుస్తోంది .
అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి: పవన్
అంతేకాదు దొరికిన ఈ విరామ సమయంలో స్క్రిప్ట్ ని ఇంకా మెరుగులు దిద్దుతున్నారట … ఎలాగో షూటింగ్ మొదలు కావడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టేలా ఉంది కనుక అల్లు అర్జున్ తన గెటప్ చేంజెస్ చేస్తున్నాడట … షూటింగ్ మొదలయ్యే నాటికీ సినిమాకి తగ్గ గెటప్ మళ్ళీ తెచ్చుకొంటాడట …. ఇదిలా వుంటే `పుష్ప` చిత్రం యొక్క కాస్ట్యూమ్స్ కోసం అల్లు అర్జున్ వేసుకునే బట్టలని ` టీ `నీళ్లలో నానబెట్టి ఒక రెండు రోజుల తర్వాత ఉతుకుతున్నారట. అలా బన్నీ వేసుకునే బట్టల్లో కూడా సహజమైన లుక్ వచ్చేలా సుకుమార్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట…తాను తీసే సినిమాలో ప్రతీది సూక్ష్మం గా పరిశీలిస్తాడు గనుకే సుకుమార్ చిత్రాలు మిగతావారికి భిన్నంగా ఉంటాయి .