Allu Arjun And Atlee: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. స్టార్ హీరోగా ఇతరులను తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం కూడా బాగుంది. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇకమీదటైనా ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ ఈ సినిమాను అట్లీ విజువల్ వండర్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి అల్లు అర్జున్ సైతం ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అట్లీ ఇంతకు ముందు చేసిన సినిమాలను చూస్తుంటే అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇప్పుడు అల్లు అర్జున్ కి కూడా కొంతవరకు భయం అయితే కలుగుతుందట.
Also Read: ప్రయాణికుల కంటే యూట్యూబర్లే ఎక్కువ.. మన సోషల్ పిచ్చికి ఇదో పరాకాష్ట!
కారణం ఏంటి అంటే అట్లీ ఇంతకు ముందు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సినిమా రిఫరెన్స్ గా తీసుకొని కాపీ చేస్తూ అందులో సీన్లని తీసుకొని వాటిని మార్పులు చేర్పులు చేస్తూ సినిమాని సక్సెస్ చేస్తూ వచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాని కూడా ఏదో ఒక సినిమా నుంచి కాపీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆ కాపీ సీన్స్ వల్ల సినిమాలను చూసే ప్రేక్షకులు ఆ సీన్స్ కి కనెక్ట్ అవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే చాలామంది ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలను చూస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో కాపీ సీన్స్ లో నటిస్తే అల్లు అర్జున్ ఇమేజ్ ఏమైనా డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా అట్లీ లాంటి దర్శకుడు ఇప్పటికైనా ఒరిజినల్ కథతో కాపీ లేకుండా ఎలివేషన్స్ ని, ఎమోషన్స్ ని నమ్ముకొని సినిమాని చేస్తే ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ గా నిలుస్తోంది. లేకపోతే మాత్రం ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలావరకు బ్యాడ్ నేమ్ ను మూట గట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…