Chiranjeevi Guinness Record : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సాధించని రికార్డు లేదు, అందుకోని అవార్డు లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ స్టార్ హీరో కూడా అందుకొని అరుదైన ఘనతలు ఎన్నో అందుకున్నాడు. రీసెంట్ గానే ఆయన ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లోకి ఎక్కిన సంగతి మన అందరికీ తెలిసిందే. తన 45 ఏళ్ళ సినీ ప్రస్థానం లో 156 సినిమాల్లోని, 537 పాటలకు గాను, 24000 డ్యాన్స్ స్టెప్స్ వేసినందుకు ఆయనకీ ఈ అరుదైన గుర్తింపు దక్కింది. ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వారు మెగాస్టార్ చిరంజీవి ని ‘మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ గా గుర్తించారు.
ఈ అవార్డుని బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. మెగాస్టార్ కి ఇలాంటి ఘనత దక్కడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అంటూ, సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన వారు ఆయనని అభినందిస్తూ పోస్టులు వేశారు. మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలు కూడా ఈ ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేయగా, అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై మౌనం వహిస్తూ వచ్చాడు. ట్విట్టర్ లో కానీ, ఇంస్టాగ్రామ్ లో కానీ ఎక్కడా కూడా ఆయన చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియచేయలేదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది చిన్న విషయం కాదు. ప్రపంచం లో చాలా అరుదైన వారికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. చిరంజీవి కి వీరాభిమాని అంటూ చెప్పుకొని తిరిగే అల్లు అర్జున్, తన అభిమాన హీరో కి ఇంతటి ఘన సత్కారం జరిగితే కనీసం స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ తో వైరం కోరుకుంటున్నాడని, మెగా ఫ్యామిలీ నీడ నుండి పూర్తిగా దూరం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలు మొత్తం ఈ రూమర్స్ ని బలోపేతం చేస్తున్నాయి. అల్లు అరవింద్ కి ఇలాంటి ఉద్దేశ్యాలు ఏమీలేవు. గత ఎన్నికలలో అల్లు అర్జున్ నంద్యాల కి వెళ్తే, అల్లు అరవింద్ అదే రోజున పిఠాపురం కి వెళ్లి పవన్ కళ్యాణ్ కి సపోర్టు చేసాడు. నిన్న జరిగిన ఈవెంట్ కి కూడా అల్లు అరవింద్ ఒక అతిథి గా పాల్గొని చిరంజీవి కి కృతఙ్ఞతలు తెలియచేసాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం గత కొంతకాలం వ్యవహరిస్తున్న తీరు ఆయన అభిమానులకు సైతం అంతు చిక్కట్లేదు. ఈ వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More