Allu Arjun : ఎంత ఎదిగినా ఒదిగి ఉండమంటారు మన పెద్దవారు. దానిపైన ఒక పాట కూడా ఉంది : మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థం అందులో ఉంది. అలానే ఒక డైలాగు కూడా ఉంది : ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అని. ఇవన్నీ సందర్భానుసారం ఆ సినిమాలో పెట్టిన పాటలు.. డైలాగులు. కానీ ప్రస్తుతం ఇవన్నీ మన నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కోసమే రాసినట్టు ఉంది. అవును 68 సంవత్సరాలలో మన తెలుగు వారికి దక్కని గౌరవం.. ఫైనల్ గా 69వ సంవత్సరం అల్లు అర్జున్ ద్వారా పొందగలిగం.
అసలు విషయానికి వస్తే తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల లో అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాలో నటించిన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సాధించలేకపోయిన జాతీయ అవార్డును.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ సాధించి పెట్టారు.
ప్రతి ఒక్కరూ తగ్గేదేలే అంటూ.. ‘పుష్ప రాజ్’కు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఉత్తమ హీరో అవార్డు కూడా ఆయనకి కనెక్ట్ అయింది. నిజంగా ఇది తెలుగు వారు గర్వించదగిన క్షణం. ఇక ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో అని భారతదేశం మొత్తం ఎదురు చూస్తూ ఉండగా ఆయన మాత్రం ‘జాతీయ అవార్డు వచ్చినంత మాత్రాన నేను మిగతా నటుల కన్నా గొప్పవాడినని అనుకోవడం లేదు’ అంటూ చెప్పుకోచ్చారు.
ఇక ఆయన అన్న ఈ మాటలు విని సోషల్ మీడియాలో అందరూ నా ఆటోగ్రాఫ్ లో భూమికా ‘మౌనంగానే ఎదగమని’ పాటని అలానే అత్తారింటికి దారేదిలో ‘ ఎక్కడ ఎదగాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు’ అని సాగే పవన్ కళ్యాణ్ డైలాగ్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఇంత గొప్ప విజయం సాధించిన అలా మాట్లాడటం ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరికీ ఆయన పైన ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది.