Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి నటులు సైతం ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ‘పుష్ప 2’ సినిమాతో అల్లు అర్జున్ పెను రికార్డ్ లను సృష్టించాడు.1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఆయన ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. సూపర్ మాన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాలో అన్ని రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా తనకి కి ఫ్యాన్ వరల్డ్ లో సైతం గొప్ప ఇమేజ్ను సంపాదించి పెడుతుందనే నమ్మకంతో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా ఆయన మరో తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టుగా కొత్త మూవీని అనౌన్స్ చేశారు. ఇంతకి ఆ దర్శకుడు ఎవరు అంటే లోకేష్ కనకరాజ్…
వైవిధ్యమైన మేకింగ్ తో సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో లోకేష్ సిద్ధహస్తుడు. గత సంవత్సరం రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమా ఫ్లాప్ అయినప్పటికి అతని మేకింగ్ కి చాలా మంచి పేరైతే వచ్చింది. కాబట్టి లోకేష్ తో సినిమా చేయాలని అల్లు అర్జున్ భావించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్లు ఉన్నప్పటికి అల్లు అర్జున్ ఎందుకని వరుసగా తమిళ్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు… నిజానికి మన తెలుగు డైరెక్టర్లు చాలామంది అల్లు అర్జున్ కి కథలను వినిపిస్తున్నప్పటికి అతనికి ఏ కథలు నచ్చడం లేదట.
తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులకు మేకింగ్ మీద మంచి పట్టు ఉండడం వల్ల వాళ్ళు చెప్పే కథలకి అల్లు అర్జున్ కనెక్ట్ అవుతున్నాడట. వాళ్ళు చెప్పిన స్టోరీలను చెప్పినట్టుగా తెరమీదకి తీసుకురాగలిగితే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయని వాళ్ళ పొటెన్షియాలిటి మొత్తాన్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా ఇటు అల్లు అర్జున్ ఇమేజ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నాడు…