Allu Arjun Arrested Again: 2024, డిసెంబర్ 4వ తేదీని అల్లు అర్జున్(Icon Star Allu Arjun), ఆయన అభిమానులు అంత తేలికగా ఎప్పటికీ మర్చిపోలేరు. ఆరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోస్ పడ్డాయి. హైదరాబాద్ లోని సంధ్య 70 MM థియేటర్ లో ఈ చిత్రాన్ని చూసేందుకు అల్లు అర్జున్ వచ్చాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎంతో మంది జీవితాలను మార్చేశాయి. అల్లు అర్జున్ ని చూసేందుకు ఎగబడిన అభిమానులను కట్టడి చేయడానికి పోలీస్ లాఠీ ఛార్జ్ చేయడం, దాంతో తొక్కిసలాట జరగడం వల్ల రేవతి మరియు ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రమైన గాయాల పాలయ్యారు. రేవతి చికిత్స పొందుతూ చనిపోగా, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. అల్లు అర్జున్ మరియు ఆయన టీం శ్రీతేజ్ కి రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ప్రభుత్వం కూడా శ్రీతేజ్ కోలుకునేందుకు సరైన వైద్య సదుపాయం కూడా కల్పించింది.
కానీ అల్లు అర్జున్ ని రావొద్దు అని చెప్పినప్పటికీ కూడా సంధ్య థియేటర్ కి వచ్చాడు అంటూ ఆయన పై పోలీసులు ఆగ్రహించడమే కాకుండా, అరెస్ట్ కూడా చేశారు. ఒక్క రోజు చంచల్ గూడ జైలు లో ఉన్న అల్లు అర్జున్, పక్క రోజు బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఈ అంశం పై నేడు అల్లు అర్జున్ తో పాటు మరో 30 మందిపై పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అల్లు అర్జున్ ని A11 నిందితుడిగా గుర్తించారు. ఈ వార్త నేడు బయటకు రాగానే, ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి, అల్లు అర్జున్ ని మరోసారి అరెస్ట్ చేయబోతున్నారా? అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఛార్జ్ షీట్ అంటే కేసు కి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకి సమర్పించే నివేదిక మాత్రమే.
ఈ నివేదిక లో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని పోలీసులు పేర్కొనడంతెజో అల్లు అర్జున్ అరెస్ట్ ఉండకపోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో కుదుట పడలేదు. ఇప్పటికీ ఆయన మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడు, లేచి నిలబడి నడవలేకపోతున్నాడు, ఎదో బ్రతికి ఉన్న శవం లాగానే అతని జీవనం గడుస్తోంది. నెలకు ఆరు లక్షల రూపాయిలను వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. పాపం ఆ పసిబిడ్డ ఏ పాపం చేసాడని ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేసాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, ఆదుకోవాల్సిన వయస్సులో తన తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటాడని ఆశిద్దాం.