
Allu Arjun: సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ కు ఓ ప్రత్యేకత ఉంది. తన సినిమా విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా సినిమాకు తన స్టైల్ ను మార్చుకుంటూ ప్రేక్షకులకు వినోదం పంచాలని తాపత్రయపడుతుంటాడు. గంగోత్రి నుంచి పుష్ప వరకు ఆయనలో మార్పును గమనిస్తూనే ఉన్నాం. తన పాత్రకు తగిన న్యాయం చేయాలని భావిస్తుంటాడు. అది డాన్సయినా, ఫైట్ అయినా తనదైన శైలిలో చేస్తూ స్టైలిష్ స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు. ఆయనతో పని చేసేందుకు అందరు దర్శకులు ఇష్టపడుతుంటారు.
తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇందులో అల్లు అర్జున్ పాత్ర కూడా అంతే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆకలికి తట్టుకోలేక అల్లు అర్జున్ చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. గోకవరం సమీపంలో ఓ చిన్న టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేసి బయటకు వచ్చిన వీడియో సంచలనం సృష్టించింది. రెండేళ్లుగా పుష్ప సినిమా షూటింగ్ జరుగుతోంది. బాక్సాఫీసు వద్ద పాన్ ఇండియన్ మార్కెట్ సృష్టించాలని అడుగులు వేస్తున్నారు.
అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అనే బిరుదు ఇచ్చేందుకు సుకుమార్ కష్టపడుతున్నాడని తెలుస్తోంది. దీనికి తోడు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ రాగాలు కూడా ఓ సంచలనం సృష్టించనున్నాయని చెబుతున్నారు. అభిమానుల కోరిక మేరకు అల్లు అర్జున్ తన శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నాడు. బన్ని కష్టానికి తప్పకుండా తగిన ఫలితం దక్కుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ ను తీర్చిదిద్దేందుకు అలుపెరగకుండా కష్టపడుతున్నాడు. గత సినిమాల కంటే భిన్నంగా ఉండాలనే తపనతో గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తున్నాడు. బాక్సాఫీసు దగ్గర భారీ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా తగిన విధంగా స్పందిస్తూ తన పాత్రకు న్యాయం చేయాలని చూస్తున్నాడు. పుష్ప మరో చరిత్ర సృష్టించడం ఖాయమని తెలుస్తోంది.