Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Gratitude Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పిన...

Allu Arjun Gratitude Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతఙ్ఞతలు చెప్పిన అల్లు అర్జున్..ట్వీట్ వైరల్!

Allu Arjun Gratitude Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డ్స్(Gaddar Awards) ని నేడు ఉదయం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తమ నటుడి క్యాటగిరీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రానికి గానూ ఈ అవార్డు వరించింది. అల్లు అర్జున్ కి, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి అసలు పడదు కదా, మరి ఆయన ప్రభుత్వం లో ఈ అవార్డుని అల్లు అర్జున్ కి ఎలా ప్రకటించారు అనేది ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. కక్ష్య సాధింపులు రేవంత్ రెడ్డి హిస్టరీ లోనే లేదని, కేవలం తప్పు ని తప్పుగా మాత్రమే చూస్తాడని, ప్రతిభ ని ప్రతిభ లాగానే చూస్తాడని, అందుకే అల్లు అర్జున్ కి ఈ అవార్డుని ప్రకటించాడని రేవంత్ రెడ్డి అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరో పక్క అల్లు అర్జున్ అభిమానులు మాత్రం అరెస్ట్ చేయించిన వాళ్ళతోనే సలాం కొట్టించుకున్నాడు మా అభిమాన హీరో అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ ఎలివేషన్స్ వేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు చెప్తూ ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘ గద్దర్ అవార్డ్స్ కి ఉత్తమ నటుడిగా నేను ఎంపిక అవ్వడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ గౌరవం దక్కడానికి కారణం డైరెక్టర్ సుకుమార్ గారు, మరియు నిర్మాతలే. ఈ అవార్డుని నా అభిమానులకు అంకితం చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. అయితే ఈ అవార్డ్స్ ని ప్రకటించినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా వచ్చి తీసుకుంటాడా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. ఎందుకంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డి కారణంగా చాలా పరువు భంగం కలిగింది.

జీవితం లో మళ్ళీ వీళ్ళు కలుసుకోరేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు అని ఈ ట్వీట్ తో స్పష్టంగా అర్థం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానింపబడి ఈ అవార్డుని అందుకోబోతున్నాడు అల్లు అర్జున్. ఎవరైతే ఆయన్ని అరెస్ట్ చేయించారో , ఆయన చేతుల మీదగా ఇలాంటి అరుదైన గౌరవం దక్కించుకోవడం సినిమాలో ఒక భారీ ఎలివేషన్ సన్నివేశాన్ని చూసినట్టుగా అనిపిస్తాది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉండిపోయాడు అల్లు అర్జున్. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version