Allu Arjun grandmother last video: అల్లు అరవింద్(Allu Aravind) తల్లి, చిరంజీవి(Megastar Chiranjeevi) కి అత్తయ్య, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి నాన్నమ్మ అయినటువంటి అల్లు కనకరత్నమ్మ(Allu Kanaka Ratnamma) నేడు స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. 94 ఏళ్ళ వయసున్న అల్లు కనకరత్నమ్మ గత కొద్దిరోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంది. నేడు పరిస్థితి చెయ్యి దాటిపోవడం తో ఆమె తుది శ్వాస విడిచింది. అల్లు అర్జున్ కి తన నాన్నమ్మ తో ఉన్న అనుబంధం సాధారణమైనది కాదు. తన తల్లి తో సమానంగా ఆమెతో బంధం ఉంది. అలాంటి నాన్నమ్మ చనిపోవడం తో అల్లు అర్జున్ శోకసంద్రం లో మునిగిపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అల్లు అర్జున్ కళ్ళలో నీళ్లు తిరిగిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వీటిని చూసి అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ తో కనకరత్నమ్మ కి ఉన్న ప్రేమానుబంధానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బయటపడి బాగా వైరల్ అయ్యింది.
గత ఏడాది డిసెంబర్ నెలలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ ని బాద్యుడిని చేస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము. దేశం మొత్తం ఈ అంశం గురించి చర్చించుకున్నది. ఆ సమయం లో అల్లు అర్జున్ కుటుంబం ఎంతటి తీవ్రమైన దిగ్బ్రాంతికి గురైందో, ఒక్కొక్కరి ముఖం లో ఎంత టెన్షన్ ఉందో మనమంతా అనేక వీడియోల్లో చూశాము. అల్లు అర్జున్ జైలు నుండి విడుదలై ఇంటికి తిరిగి రాగానే ఆయన కుటుంబం మొత్తం స్వగతం పలికేందుకు బయటకు వచ్చింది. వారిలో అల్లు కనకరత్నమ్మ కూడా ఉంది. నడవలేని పరిస్థితిలో కూడా ఆమె లోపల నుండి బయటకు నడుచుకుంటూ వచ్చి, అల్లు అర్జున్ ని ప్రేమతో హత్తుకొని, ఆయనకు దిష్టి తీసిన వీడియో ని మీరు క్రింద చూడవచ్చు.
వీళ్ళ మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఉన్నాయి. నాన్నమ్మ తో అంతటి కనెక్షన్ ఉండడం వల్లే అల్లు అర్జున్ ఈ బాధ నుండి తేరుకోవడం లేదు. కొన్నేళ్ల క్రితమే అల్లు రామలింగయ్య అవార్డ్స్ ని ప్రకటించిన సమయం లో అల్లు కనకరత్నమ్మ ని కూడా వేదిక మీదకు తీసుకొచ్చి ఆమెని ప్రత్యేకంగా సన్మానించాడు అల్లు అర్జున్. పెద్ద వయస్సు లో తన మనవడి విజయాలను మొత్తం చూసింది. ముని మనవడు, ముని మనవరాలు ఎదగడం చూసింది, కొడుకు అల్లు అరవింద్ ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ నిర్మాతగా ఎదగడం కళ్లారా చూసి సంతృప్తి చెందింది. ఇలా పరిపూర్ణమైన జీవితాన్ని చూసిన అల్లు కనకరత్నమ్మ 94 ఏళ్ళ వయస్సులో తెల్లవారు జామున ప్రశాంతవంతమైన చావు ని దక్కించుకుంది. అల్లు కుటుంబం మొత్తానికి మొత్తం ఈ సినిమాలో దేవుడు మనోధైర్యం ఇవ్వాలని, అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.
అల్లు అర్జున్ నాన్నమ్మ చివరి వీడియో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!#AlluArjun #AlluArjunsGrandMother #OmShanti #AlluAravind #AlluKanakaratnam #RIP #AlluRamalingaiah #Chiranjeevi #Megastar #AlluSirish #RamCharan #MaheshBabu #OkTelugu #OkTeluguNews pic.twitter.com/c5u3g8eXkB
— OkTelugu (@oktelugunews) August 30, 2025