https://oktelugu.com/

Allu Arjun: ‘పుష్ప 2’ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్…

సుకుమార్ డైరెక్షన్ లో, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక బాలీవుడ్ లో కూడా తనదైన మార్క్ ప్రతిభను చూపిస్తూ పుష్ప చాలా మంచి సక్సెస్ ని అందుకోవడమే కాకుండా బాలీవుడ్ లో భారీ సక్సెస్ సాధించిన మూడోవ తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది.

Written By:
  • Gopi
  • , Updated On : November 12, 2023 / 10:12 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అవుతుంటాయి. ఇక ఆ సినిమాల మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలు,అలాగే సగటు సినిమా అభిమాని పెట్టుకున్న అంచనాలు అన్ని కూడా వృధా అయిపోతాయి.ఇక అప్పుడు ఆ సినిమా టీమ్ మొత్తం కూడా నిరాశకు గురవుతూ ఉంటారు.కానీ కొన్ని సినిమాలు మాత్రం మనం పెట్టుకున్న అంచనాలకు డబుల్ , త్రిబుల్ గా మనల్ని అలరిస్తూ ఉంటాయి. అలాంటి క్రమంలో మన ముందుకు వచ్చిన సినిమానే పుష్ప…

    సుకుమార్ డైరెక్షన్ లో, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక బాలీవుడ్ లో కూడా తనదైన మార్క్ ప్రతిభను చూపిస్తూ పుష్ప చాలా మంచి సక్సెస్ ని అందుకోవడమే కాకుండా బాలీవుడ్ లో భారీ సక్సెస్ సాధించిన మూడోవ తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది.ఇక మొదట బాహుబలి రెండు పార్ట్ లు భారీ వసూళ్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్ అవ్వగా, ఆ రెండింటి తర్వాత పుష్ప సినిమానే తెలుగు నుంచి బాలీవుడ్ కి వచ్చి భారీ విజయం అందుకుంది…ఇక ఈ సినిమా తో రీసెంట్ గా అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు…

    ఇక అదే ఉత్సాహం తో ఇప్పుడు పుష్ప కి సిక్వల్ గా పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మీదనే ప్రతి ప్రేక్షకుడు కూడా విపరీతమైన అంచనాలను పెట్టుకున్నాడు. ఎందుకంటే పుష్ప 2 సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుంది అన్నట్టుగా సినిమా టీమ్ చెబుతూనే దానికి తగ్గట్టు గా హింట్స్ కూడా ఇచ్చారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో పాటు గా పుష్పరాజ్ క్యారెక్టర్ నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది కూడా చాలా క్లియర్ గా టీజర్ లో చూపించారు.

    ఇక ఇప్పుడు పుష్ప రాజ్ అప్డేట్ అనేది వచ్చింది.ఇక రీసెంట్ గా మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ని ప్రేక్షకుల ముందు ఉంచాడు అది ఏంటి అంటే పుష్ప 2 మూవీ పోస్టర్ లో గంగమ్మ తల్లి జాతర పిక్ వదిలారు కాబట్టి ఇప్పుడు దానికి సంభందించిన షూట్ రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరిస్తున్నాం అని చెబుతూనే ఆ ఎపిసోడ్ మిమ్మల్నీ చాలా బాగా అలరిస్తుంది అని చెప్పాడు.

    ఇక ఈ సినిమా 2024 ఆగస్ట్ 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకులు విపరీతమైన అంచనాలను పెట్టుకోగా ఈ సినిమా రిలీజై ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో కలక్షన్ల సునామిని సృష్టించగా, పుష్ప పార్ట్ వన్ కి కూడా అద్భుతమైన కలక్షన్స్ వచ్చాయి.ఇక పుష్ప 2 సినిమా కూడా ఇంకా ఎన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది…