Trolls on Allu Arjun: హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియా లో చూసేందుకే చాలా చిరాకుగా ఉంటుంది, తాము ఎవరో తెలియని హీరోల కోసం ఎందుకు ఫ్యాన్స్ ఇలా కొట్లాడుకుంటున్నారు?, వ్యక్తి పూజ అసలు మంచిది కాదు అని మన మనస్సులో ఎన్నో సార్లు అనుకొని ఉండుంటాము. కానీ ఇది ఎప్పటికీ మార్చలేం కాబట్టి, నెటిజెన్స్ కూడా అలవాటు పడ్డారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ కాస్త ఆఫ్ లైన్ వరకు వెళ్లాయి. వివరాల్లోకి వెళ్తే కొన్ని రోజుల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2’ చిత్రాన్ని హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో స్పెషల్ షో వేశారు. ఈ షో లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ప్రభాస్(Rebel Star Prabhas) లను వెక్కిరిస్తూ కొన్ని ప్లకార్డులను పట్టుకొచ్చారు.
అందుకు కారణం గతం లో ప్రభాస్ ఫ్యాన్స్ అదే విమల్ థియేటర్ లో ‘రాజా సాబ్’ మూవీ మొదటి సాంగ్ రిలీజ్ ఈవెంట్ చేశారు. అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు చేశారు. దానికి రివెంజ్ తీర్చుకుంటూ పుష్ప స్పెషల్ షో లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలా చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే, ప్రభాస్ ని ట్రోల్ చేసి వదిలేసి ఉండుంటే బాగుండేది. కానీ సంబంధం లేని పవన్ కళ్యాణ్ ని కూడా ట్రోల్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేశం కట్టలు తెంచుకుంది. డిసెంబర్ 21 న బెంగళూరు లో ఓజీ స్పెషల్ షో ని నిర్వహించారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని వేరే లెవెల్ లో వెక్కిరిస్తూ, అతని మాస్క్ కి బాంబు పెట్టి పేల్చడం, కతనా తో అల్లు అర్జున్ మాస్క్ ని గుచ్చి, థియేటర్ గుమ్మానికి వేలాడదీయడం వంటివి చేశారు.
అవి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇక నేడు జల్సా మూవీ స్పెషల్ షోస్ లో అల్లు అర్జున్ ని ఎవ్వరూ ఊహించని రేంజ్ ట్రోల్ చేస్తూ వీడియోలు అప్లోడ్ చేశారు. అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో వెక్కిలి గా నవ్వే ఒక షాట్ ని మాస్క్ గా క్రియేట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో జల్సా ప్రదర్శితమవుతున్న ప్రతీ థియేటర్ లోనూ అల్లు అర్జున్ పరువు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగేలా లేదు, రేపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీనికి కౌంటర్లు ఇస్తారు. ఇలా ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో లేని నీచమైన సంస్కృతి భీజం పడింది. దీన్ని పోలీసులు ఇప్పుడే గుర్తించి చర్యలు తీసుకోకుంటే, రాబోయే రోజుల్లో అనర్థాలు జరిగే అవకాశాలు లేకపోలేదు.
Orey… ComediAAn ni chesi 10ngaru entra cults #Jalsa4K pic.twitter.com/OYCOMUvBHC
— OG (@VenkaT_PawanisT) December 31, 2025
Life time humiliation ra AAthu#Jalsa4Kpic.twitter.com/xx6SweCpLg
— JOHNNY_PSPK (@johnny_pspk07) December 31, 2025
Nadi road lo gang bang chesthunnaru AAdini kanisam aape dikku ledhu
Never ever try to mess with PK fans, miru chesina dhaniki x10 times tirigi istharu pic.twitter.com/4uE1rUQ5kk
— мαнєѕн ρѕρк™ (@kalyan__cult) December 31, 2025