Allu Arjun Early Career : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో కంటెంట్ చాలా అద్భుతంగా ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు.అందుకే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. పాన్ ఇండియాలో వరుస సినిమాలు చేస్తూ ఏ హీరోకి సాధ్యం కానీ రేంజ్ లో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… రీసెంట్ గా పుష్ప 2 (Pushpa 2) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా చూపించాయి. మరి ఇక మీదట ఆయన సాధించబోయే విజయాలు అతన్ని ఏ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తాయి తద్వారా ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read : హరి హర వీరమల్లు’ సెన్సార్ కార్యక్రమాల గురించి అప్డేట్ వచ్చేసింది..ఫ్యాన్స్ కి పండగే!
ఇక కెరియర్ మొదట్లో అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న క్రమంలో వాళ్ళ నాన్న అయిన అల్లు అరవింద్ వచ్చి ఏదైనా గిఫ్ట్ కావాలా అని అడిగితే దానికి అల్లు అర్జున్ గుణశేఖర్ (Gunashekar) తో సినిమా చేయాలి అతన్ని సినిమాకి ఒప్పించమని చెప్పారట. దాంతో అల్లు అరవింద్ గుణశేఖర్ తో మాట్లాడి ‘వరుడు’ (Varudu) సినిమా చేయించాడు.
మొత్తానికైతే ఈ సినిమా ప్లాప్ అయినప్పటికి అప్పట్లో గుణశేఖర్ కి చాలా మంచి డిమాండ్ అయితే ఉండేది. ఇక గుణశేఖర్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఆ తర్వాత రుద్రమదేవి సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో ఆయన గోన గన్నారెడ్డిగా నటించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు…
ఇక ఇప్పటికీ గుణశేఖర్ అల్లు అర్జున్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి వీళ్లిద్దరూ కలిసి ఇకమీదట మరికొన్ని సినిమాలు చేస్తే చూడాలని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి ఎదురు చూస్తూ ఉండడం విశేషం…