Allu Arjun: ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలని అందరికీ ఉంటుంది. హీరోలకు స్టార్ హీరోలుగా మారాలని ఉంటుంది, ఒక భాషలో స్టార్ హీరోలకు మరో భాషలో కూడా స్టార్లుగా ఎదగాలని ఉబలాటం ఉంటుంది. ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా సినిమా అంటూ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇలాంటివే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలని బాగా ముచ్చట పడ్డాడు.

కానీ పాన్ ఇండియా స్టార్ అవ్వడం అంటే అంత తేలికేం కాదు కదా. అసలు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు రావాలంటే ఎన్నో కలిసి రావాలి. అయినా అందరికీ ప్రభాస్ కి కలిసి వచ్చినట్లు ఎలా వస్తోంది ? మొత్తానికి అల్లు అర్జున్ అయితే, ఓ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ‘పుష్ప’కు నేషనల్ రేంజ్ బజ్ రావడం లేదు. పుష్ప సినిమా ఐదు భాషల్లో విడుదలచేయాలని చూస్తున్నారు.
కానీ ఏ భాషలోనూ పెద్దగా అంచనాలు లేవు. ఒక్క తెలుగులో తప్ప. ఇక బన్నీ కూడా మిగిలిన భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడంలో చేతులెత్తేశాడు. మొత్తమ్మీద పుష్ప విషయంలో అల్లు అర్జున్ ఒక్క తెలుగులో తప్ప మరో భాషలో డబ్బింగ్ చెప్పడం లేదని తేలిపోయింది. డబ్బింగ్ చెప్పే ఆలోచన లేదని మేకర్స్ కి బన్నీ క్లారిటీ ఇచ్చేశాడు.
కావున, కేవలం తెలుగులో మాత్రమే బన్నీ గొంతు వినిపిస్తుంది. అయినా డైలాగులు చెప్పాలి అంటే.. వాయిస్ మీద మంచి కమాండ్ కావాలి. మిగతా భాషల్లో బన్నీకి పెద్దగా పట్టు లేదు. అలాంటాప్పుడు పట్టు ఎలా వస్తోంది. అందుకే మిగిలిన భాషల్లో అక్కడ డబ్బింగ్ ఆర్టిస్టుల చేత బన్నీ పాత్రకు డబ్బింగ్ చెప్పించనున్నారు. ”ఆర్ఆర్ఆర్ “లో ఎన్టీఆర్, చరణ్ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీలో కూడా సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు.
అలాగే ప్రభాస్ హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్నాడు. చివరకు విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’ కోసం హిందీలో డబ్బింగ్ చెబుతున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క తెలుగుకే పరిమితం అయిపోయాడు.
Also Read: Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్… ఆందోళనలో అభిమానులు