Allu Arjun: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ కి ఈ చిత్రం రూపం లో భారీ బ్లాక్ బస్టర్ దొరికింది. థియేటర్స్ లో 6 వారాలకు పైగా రన్ అయిన ఈ చిత్రం, రీసెంట్ గానే ఓటీటీ లో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. నాలుగు వారాల నుండి ఎన్ని కొత్త సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైనప్పటికీ ఓజీ చిత్రం టాప్ 10 లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ చిత్రం 7 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుందట. ఫుల్ రన్ లో కచ్చితంగా కోటి కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రాన్ని కేవలం అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కూడా ఉన్నాడు. ఈ సినిమా విడుదలైన కొత్తల్లోనే ఆయన AMB సినిమాస్ లో కుటుంబ సభ్యులతో కలిసి చూసాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. కచ్చితంగా ఆయన వైపు నుండి ఈ సినిమా గురించి ట్వీట్ పడుతుందని ఆశించారు ఫ్యాన్స్. కానీ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ వైపు నుండి ఒక్క ట్వీట్ కూడా పడకపోవడం గమనార్హం. సాధారణంగా అల్లు అర్జున్ ఏ సినిమాని థియేటర్ లో చూసినా, తన ట్విట్టర్ మరియు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ లో ఆ సినిమా తాలూకు అనుభవాన్ని పంచుకుంటూ ఉంటాడు. ఇది ఆయన అభిమానులతో పాటు, నెటిజెన్స్ అందరికీ తెలిసిందే.
కానీ ఎందుకు ఓజీ చిత్రాన్ని ఆయన చూసి కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. సినిమా ఆయనకు నచ్చలేదా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ సినిమా నచ్చి ఉంటే కచ్చితంగా అల్లు అర్జున్ ట్వీట్ వేసేవాడని అభిమానుల నుండి వినిపిస్తున్న వాదన. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2027 వ సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. పుష్ప 2 తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అల్లు అర్జున్, అట్లీ మూవీ తో పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని ఏ రేంజ్ లో బద్దలు కొడుతాడో చూడాలి.