https://oktelugu.com/

Aadipurush – Allu Arujun : ఆదిపురుష్’ చిత్రం కోసం తన వంతు సహాయం చేసిన అల్లు అర్జున్

హైదరాబాద్ లోని అమీర్ పెట్ లో అల్లు అర్జున్ ఒక భారీ మల్టిప్లెక్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మల్టిప్లెక్స్ ఈనెల 16 వ తారీఖున ఆదిపురుష్ సినిమాతో ప్రారంభం కాబోతుంది అట. మరి అల్లు అర్జున్ కూడా తన థియేటర్ లో అనాధపిల్లలకు ఉంచితంగా ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శిస్తాడో లేదో మన దగ్గర సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : June 11, 2023 / 09:52 AM IST
    Follow us on

    Aadipurush – Allu Arujun : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’.ఈ చిత్రం ఈ నెల 16 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు తో పాటుగా హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్, పాటలు మూవీ పై అంచనాలను అమాంతం పెంచేసాయి. ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేసాయి.

    మరో పక్క ఫ్రీ టికెట్స్ పేరుతో అనాధ పిల్లకు వృధాశ్రమాలకు మూవీ టీం టికెట్స్ పంపిణీ చెయ్యడం కూడా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చేసింది. నిర్మాతలు తీసుకొని ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ రామ్ చరణ్ మరియు రణబీర్ కపూర్ వంటి హీరోలు కూడా 20 వేలకు పైగా టికెట్స్ ని కొనుగోలు చేసి అనాధ పిల్లలకు ఉచితంగా ఆదిపురుష్ షో ని చూపించబోతున్నారు.

    ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మరియు రణబీర్ కపూర్ లాగ చెయ్యలేదు కానీ, ఆదిపురుష్ చిత్రానికి హైదరాబాద్ లో అదనపు గ్రాస్ వచ్చే పని చేస్తున్నాడు. హైదరాబాద్ లోని అమీర్ పెట్ లో అల్లు అర్జున్ ఒక భారీ మల్టిప్లెక్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మల్టిప్లెక్స్ ఈనెల 16 వ తారీఖున ఆదిపురుష్ సినిమాతో ప్రారంభం కాబోతుంది అట. మరి అల్లు అర్జున్ కూడా తన థియేటర్ లో అనాధపిల్లలకు ఉంచితంగా ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శిస్తాడో లేదో మన దగ్గర సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు.

    ఇకపోతే రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ U సర్టిఫికెట్ ని జారీ చేసారు. సినిమా నిడివి మూడు గంటల వరకు ఉంటుంది. మరి శ్రీ రాముడిగా ప్రభాస్ కి జనాలు ఏ స్థాయిలో నీరాజనాలు పలకబోతున్నారో తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.