‘ఐకాన్’పై బ‌న్నీ ఆలోచ‌న ఇదేన‌ట‌..!

అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప’. బన్నీ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. ఆగ‌స్టులో రిలీజ్ కానుంది. మ‌రి, ఈ సినిమా త‌ర్వాత ప‌ట్టాలెక్కే ప్రాజెక్టు ఏంట‌న్న‌ది అభిమానులకు స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమా కంప్లీట్ కాగానే.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌ని అనుకున్నాడు. కానీ.. కొర‌టాల ఉన్న‌ట్టుండి ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడు. దీంతో.. వాట్ నెక్స్ట్ అనే క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ అయ్యింది. మిగిలిన స్టార్ డైరెక్ట‌ర్స్ […]

Written By: Bhaskar, Updated On : April 19, 2021 2:31 pm
Follow us on


అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప’. బన్నీ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. ఆగ‌స్టులో రిలీజ్ కానుంది. మ‌రి, ఈ సినిమా త‌ర్వాత ప‌ట్టాలెక్కే ప్రాజెక్టు ఏంట‌న్న‌ది అభిమానులకు స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమా కంప్లీట్ కాగానే.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌ని అనుకున్నాడు. కానీ.. కొర‌టాల ఉన్న‌ట్టుండి ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడు. దీంతో.. వాట్ నెక్స్ట్ అనే క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ అయ్యింది.

మిగిలిన స్టార్ డైరెక్ట‌ర్స్ ఆ స‌మ‌యానికి ఫుల్ బిజీగా ఉంటారు. అందువ‌ల్ల కుదిరే ఛాన్స్ త‌క్కువ‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘ఐకాన్’ మూవీ తెర‌పైకి వ‌చ్చింది. ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు ఎప్పుడో వినిపించాడు. బ‌న్నీ కూడా ఓకే అన్నాడు. అయితే.. వీలైన‌ప్పుడు చేస్తాన‌ని మాట ఇచ్చాడు. ఇప్పుడు వ‌కీల్ సాబ్ విజ‌యంతో దిల్ రాజు కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ.. అల్లు అర్జున్ మౌనంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

‘అల వైకుంఠ‌పుర‌ములో’ సక్సెస్ తర్వాత ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మారిన‌ట్టుగా చెబుతున్నారు. స్టార్ స్టేట‌స్ మ‌రింత‌గా పెరిగిపోయింద‌ని, అందువ‌ల్ల ఎవ‌రితో బ‌డితే వాళ్ల‌తో సినిమా చేయొద్ద‌ని అనుకుంటున్నాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. కేవ‌లం స్టార్ డైరెక్ట‌ర్స్ తోనే సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

అందుకే.. ‘ఐకాన్’ గురించి సీరియస్ గా ఆలోచించట్లేదని చెబుతున్నారు. పుష్ప పూర్తయిన తర్వాత.. మిగిలిన దర్శకుల వీలును పరిశీలించి.. అనుకున్న వారు ఎవ్వరూ ఖాళీగా లేకపోతే.. అప్పుడు వేణుశ్రీరామ్ గురించి ఆలోచిస్తాడ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల వేణు మాట్లాడుతూ.. ఐకాన్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం విశేషం. దిల్ రాజు మాత్రం నెక్స్ట్ మూవీ అదేన‌ని అన్నారు. మ‌రి, ఇందులో ఏది వాస్త‌వం? అన్న‌ది చూడాలి.