Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై స్పష్టత ఇస్తూ నేడు అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ కాసేపటి క్రితమే దీనిపై స్పందిస్తూ పెట్టిన ప్రెస్ మీట్ కి అభిమానులు చాలా ఎమోషనల్ అయ్యారు. చెయ్యని తప్పుకి తమ అభిమాన హీరో లేని పోనీ నిందలు అనుభవిస్తున్నాడని, దురదృష్టకరమైన సంగటన ఒకటి జరిగింది, దానికి ఎవరూ బాద్యులు కాదు, కానీ ప్రభుత్వం అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా చిత్రీకరించి మాట్లాడడం బాధాకరం అని, మా అభిమాన హీరో ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ, అతని క్యారక్టర్ పై ఆరోపణలు చెయ్యడం తప్పని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకోవడాన్ని ఆయన అభిమానులు అసలు తట్టుకోలేకపోతున్నారు.
అల్లు అరవింద్ కూడా కొడుకు బాధని చూసి కృంగిపోయాడు. ప్రెస్ మీట్ చివర్లో మీడియా అడిగే ప్రశ్నలకు నేను ఇప్పుడు సమాధానం చెప్పకూడదని, కోర్టు లో కేసు నడుస్తుందని, రూల్స్ ప్రకారం మాట్లాడితే మళ్ళీ నాకు లీగల్ సమస్యలు ఎదురు అవుతాయని, ఏదైనా ఉంటే మా న్యాయవాది, మా నాన్న గారు మాట్లాడుతారని చెప్పి అల్లు అర్జున్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అల్లు అరవింద్ మీడియా తో మాట్లాడుతూ ‘బన్నీ కి ఇది రాత్రి కి రాత్రి వచ్చిన గౌరవ మర్యాదలు కాదు. 22 ఏళ్లుగా ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు. నేడు అతనికి ఇలా జరగడం బాధ వేస్తుంది. ఈ ఘటన జరిగినప్పటి నుండి అల్లు అర్జున్ మనిషిలా లేదు. గార్డెన్ వద్ద కూర్చొని రోజూ బాధపడుతూ ఉండేవాడు..పుష్ప సక్సెస్ ని దేశం మొత్తం ఎంజాయ్ చేస్తుంది. నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యి అన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అలా నేను చెప్పినప్పుడు, అల్లు అర్జున్ అలా ఎలా నేను ఎంజాయ్ చేయగలను, నా బిడ్డ వయస్సు ఉన్న అబ్బాయి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, అతనికి అలా ఉన్నప్పుడు నేను ఈ సక్సెస్ ని తీసుకోలేను అన్నాడు. దేశం మొత్తం గర్వించే దగ్గ రికార్డ్స్ పెట్టినా కూడా వాడు ఈరోజు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అంత బాధ వాడిలో ఉంది. అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం’ అంటూ అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.